అంతర్జాతీయ వేదికపై చైనా నీతి పలుకులు

ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కనబర్చేందుకు చైనా ఎన్ని కుయుక్తులు అయినా పన్నుతుంది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

చైనా మాట ఒకటి చేత ఒకటి ఉంటుంది.

ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపితం అయ్యింది.తాజాగా మరోసారి చైనా దుర్నీతి అర్థం అయ్యింది.

Jin Ping About Ladakh Issue, Chaina, JInping, Galwan Valley, IRASA, Indian Army,

ఒక వైపు సరిహద్దు వెంబడి చైనా ఇండియాను పదే పదే కవ్విస్తూనే ఉంది.ఇండియాకు చెందిన భూభాగంను ఇప్పటికే ఆక్రమించుకున్న చైనా ఇండియన్‌ ఆర్మీకి చెందిన వారిని కూడా చంపేందుకు వెనుకాడలేదు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో మాత్రం చైనా నీతి పలుకులు పలుకుతోంది.తాజాగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ ఐఖ్యరాజ్య సమితి సమావేశంలో మాట్లాడుతూ.

Advertisement

తూర్పు లడఖ్‌ లోని చైనా, భారత్‌ సైన్యాల మద్య నెలకొన్న ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు కూడా ప్రయత్నంచాలని ఆయన కోరాడు.చర్చల ద్వారా వివాదాలు అన్ని కూడా పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

తాము అన్ని దేశాలతో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం.మాకు ఏదేశంతో సమస్య ఉన్నా కూడా చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం అంటూ నీతి పలుకులు పలికిన చైనా అధ్యక్షుడు మరో వైపు దేశ సరహద్దు వెంట మాత్రం అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు