అమెరికాలో కలకలం రేపుతున్న బడా ఫైనాన్సర్ ఆత్మహత్య

అమెరికాకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, ఎంతో మంది రాజకీయ నాయకులకి , కంపెనీలకి ఫైనాన్సర్ గా ఉన్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌.

జులై నెలలో పోలీసులు బాలికల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ చేశారు.

అమెరికాలోనే ప్రముఖ వ్యక్తిగా పేరొందిన జెఫ్రీ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులకి కూడా ఎంతో సన్నిహితుడిగా ఉండేవాడు.తాజాగా జెఫ్రీ తాను ఉంటున్న జైలులోనే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

జెఫ్రీ వయసు 66 ఏళ్ళు కాగా అతడు 14 ఏళ్ళ వయసు ఉన్న బాలికలని తనకి ఉన్న ప్రత్యేకమైన భవనంలో ఉంచేవాడు.వారిని అక్రమ రవాణా చేసేవాడు.

అతడి తరుపున లాయర్లు బెయిల్ కోసం ఎంతగా ప్రయత్నించినా సరే అందుకు అధికారుల నుంచీ అనుమతి లభించలేదు.దాంతో మాన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటిన్‌ కరెక్షనల్‌ శిక్షని అనుభవిస్తున్నాడు.

Advertisement

ఇదిలాఉంటే గత నెలలోనే జెఫ్రీ మెడ మీద గాయాలతో జైలులోనే స్పృహ కోల్పోయి ఉన్నాడని అందుకు గల కారణాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.అయితే జెఫ్రీ తన నివాసంలోనే పోలీసుల కాపలా మధ్య తనని ఉండటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా న్యాయమూర్తిని కోరిన అనుమతి ఇవ్వలేదు.ఈ లోగానే జెఫ్రీ జైలులో విగత జీవిగా పడి ఉండటం ఎన్నో అనుమానాలని రేకెత్తిస్తోంది అంటున్నారు జెఫ్రీ తరుపు లాయర్లు.

నైట్‌ నిద్రించే ముందు ఇలా చేస్తే.. వేక‌ప్ అద్భుతంగా ఉంటుంది!
Advertisement

తాజా వార్తలు