మాదకద్రవ్యాల పై సంచలన కామెంట్స్ చేసిన జేడీ లక్ష్మీనారాయణ

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో అమెరికన్ పొగ్రసివ్ తెలుగు అసోసియేషన్ (APTA)వారి ఆధ్వర్యంలో విద్యార్దీ విద్యార్థి నిలకు స్కాలర్ షిప్ లు అందించే కార్యక్రమంనకు సి బి ఐ మాజి జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆప్త ద్వారా 2021 విద్యా సంవత్సరం లో ఎంపిక కాబడిన పన్నెండు వందల మంది పేద విద్యార్థినీ విద్యార్థులు కు సుమారు రెండు కోట్లు ఇరవై లక్షల రూపాయలు ఉపకార వేతనాలు (స్కాలర్ షిప్) అందించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాల అలవాటు పడుతున్నారు అనే అంశంపై మాట్లాడుతూ డ్రగ్స్ అనేది నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య అన్నారు, రిసెర్చ్ స్టడీ ప్రకారం ముందుగా విద్యార్థులు పొగ తాగడానికి మరియు ఆల్కహాల్ సేవించడానికి అలవాటుపడి అనంతరం డ్రగ్స్ బారిన పడుతున్నట్టు తెలిపారు విద్యార్థుల్లో ఈ లక్షణాలు ముందుగానే తల్లిదండ్రులు మరియు విద్యాసంస్థల వారు కనుగొనట్లయితే వారిలో కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకువచ్చి వీటిబారినపడకుండానిరోదించటానికి వీలుంటుందన్నారు.కొంతమంది విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లయితే కొత్త ఆలోచనలు వస్తాయని ఫర్ఫార్మెన్స్ బాగుంటుందని దురాలోచన కలిగి ఉండటం లేదా కొంత మంది గ్రూపులలో జాయిన్ చేసుకుంటారని భావాలతో డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు దీనివల్ల వారి ఆరోగ్యానికి ఆలోచనా విధానానికి విఘాతం కలుగుతుందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నిరోధించడానికి నిషా భారత్ ముక్త అనే కార్యక్రమాన్ని 272 జిల్లాల్లో అమలు చేస్తుందని వివరించారు అంతేకాకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారుకూడా మాదక ద్రవ్యాలు విషయం లో ఉక్కుపాదం మోపుతున్నారని వివరించారు ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు తెలిస్తే ఆసమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని, మాదకద్రవ్యాలను రూపుమాపటం మనందరి సామాజిక బాధ్యత అని ఆయన వివరించారు.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు