జేసీ ప్రభాకర్ రెడ్డి సెల్ఫీ ఛాలెంజ్ ! 

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు సెల్ఫీ చాలెంజర్ల ట్రెండ్ నడుస్తోంది .

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh )యువ గళం పాదయాత్రలో భాగంగా గత టిడిపి ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి , ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కారణంగా వెనుకబడిన అభివృద్ధిని లోకేష్ సెల్ఫీలు ద్వారా వెలుగులోకి తీసుకొస్తూ , వైసీపీ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచే విధంగా ప్రయత్నాలు చేస్తుండగా , ఇప్పుడు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ , టిడిపి కీలక నేత జెసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) సెల్ఫీ చాలెంజ్లతో వైసిపి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్నారు ముఖ్యంగా తాడిపత్రిలో ఇసుక రాజకీయం గత కొద్దిరోజులుగా రాజకీయ దుమారం రేపుతోంది.

  పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక వైసిపి నాయకులు తవ్వుతున్నారని జెసి ప్రభాకర్ రెడ్డి విమర్శిస్తున్నారు.

పర్మిషన్ తీసుకుంది కొంత అయితే దోచుకుంది కొండంత అంటూ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ( MLA Ketireddy Peddareddy )జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు .  దీనిలో భాగంగానే పెన్నా నది ఇసుక రీచ్ వద్దకు వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ సెల్ఫి దిగి  అక్కడే ఆందోళన చేపట్టారు.కొద్ది రోజుల క్రితం లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టిన సమయంలోను పెన్నా నదిలో ఇసుక తవ్వకాల పై సెల్ఫీ చాలెంజ్ చేశారు.

ఇప్పుడు పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యక్ష పోరాటం చేపట్టేందుకు జెసి ప్రభాకర్ రెడ్డి సిద్ధమవుతున్నారు.

Advertisement

పెన్నా నదిలో పర్మిషన్ లేకుండా ఇసుక రవాణా చేస్తే వచ్చే సోమవారం నుంచి అక్కడే దీక్ష చేపడతానంటూ ప్రభాకర్ రెడ్డి సవాల్ చేశారు.అంతేకాదు పెన్నా నది నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే ట్రాక్టర్లు , ట్రిప్పర్లు,  జెసిబిలను కాల్చిపడేస్తానని హెచ్చరికలు కూడా చేశారు .తనపై ఎలాంటి కేసులు పెడతారో పెట్టుకోవాలంటూ సవాల్ చేశారు.గత నాలుగేళ్ల నుంచి ఈ విధంగా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఏ అధికారి పట్టించుకోవడంలేదని,  అక్రమంగా ఇసుక తోలవద్దని కోర్టు నుంచి ఆర్డర్ కూడా తాను తీసుకొచ్చాను అని,  రాబోయే రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పంచ విప్పి ప్రజలు కొట్టడం ఖాయమని ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు