Jayasudha Nitin Kapoor : జయసుధ ఫ్యామిలీ కి ఇలాంటి శాపం ఉందా ? అందుకే అలా జరిగిందా ?

సహజ నటి జయసుధ( Jayasudha ) సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే నితిన్ కపూర్ అనే వ్యక్తితో వివాహం జరగగా, వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు అనే విషయం మనందరికీ తెలిసిందే.

కొన్నాళ్ల క్రితం నితిన్ కపూర్( Nithin Kapoor ) బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునే కన్నుమూశారు.

ఈ సంఘటన ముంబైలో జరగగా, ఇలాంటి ఒక సంఘటనకు కారణం చాలా మంది జయసుధ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.నితిన్ కపూర్ కొన్ని సినిమాలను నిర్మించి పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని, అవి నెరవేర్చడంలో జయసుధ సహాయం చేయకపోవడం వల్లే కన్ను మూసారని కొంతమంది అంటుంటారు.

అందులో నిజానిజాలు ఏంటో తెలియదు కానీ వీటిపై జయసుధ కూడా ఎప్పుడు స్పందించే ప్రయత్నం చేయలేదు.

అయితే చాలా రోజుల తర్వాత జయసుధ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజానిజాలను బయటపెట్టారు.ఇంట్లో సంపాదించి పెట్టేది కేవలం నేను మాత్రమే అని, ఎలాంటి చీకు చింత లేకుండా బ్రతకాలని మా కుటుంబం ఎప్పుడు అనుకునే వారిమని, ఆత్మహత్య చేసుకొని చనిపోయేంత అప్పులు మాకు లేవని, ఒక కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నామని కానీ మా కుటుంబానికి ఉన్న శాపం వల్లే ఆయన అలా చేసుకున్నారని జయసుధ తెలిపారు.నితిన్ కపూర్ కుటుంబం సైడు వారి కుటుంబంలోనే ఇలాంటి ఒక కర్స్ అనేది చాలా సార్లు కొనసాగుతూ వస్తుందని ఇప్పటికే నితిన్ అన్నయ్య కూడా అలాగే ఆత్మహత్య( Nitin Kapoor Brother ) చేసుకుని చనిపోయారని జయసుధ తెలుపుతున్నారు.

Advertisement

అలాగే నితిన్ కపూర్ కుటుంబంలో మరో ఇద్దరు మహిళలు కూడా ఆత్మహత్య కారణంగానే చనిపోయారని, చిన్న సమస్య వచ్చినా తట్టుకునే శక్తి వారికి లేకపోవడం వల్ల ఇలాంటి బలహీన నిర్ణయాలు తీసుకుంటారని ఆమే చెప్పారు.ఆ శాపం తన పిల్లలకు, మనవళ్ళకి తగలకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ తెలిపారు జయసుధ.నితిన్ కావాలి అనుకుంటే ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండేవారమని అతడు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నాడని దాదాపు రెండేళ్లుగా కాపాడుతూ వచ్చామని, కానీ ముంబై( Mumbai )కి వెళ్ళాక ఇలా చేస్తాడని ఊహించలేదు అంటూ జయసుధ తెలిపారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement