బన్నీ అరెస్ట్ అయితే జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ( Johnny master )ఇటీవలే దాదాపు నెల రోజులపాటు జైలు జీవితాన్ని గడిపి బయటికి వచ్చిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం యధావిధిగా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు జానీ మాస్టర్.

అయితే ఇటీవలే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంతో మరోసారి జానీ మాస్టర్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీ తేజ్ ను పరామర్శించడం కోసం హాస్పిటల్ కి వెళ్లారు జానీ మాస్టర్.

ఈ సమయంలోనే జానీ మాస్టర్ కు అల్లు అర్జున్ ( Allu Arjun )సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురైన విషయం తెలిసిందే.

కానీ ఆ విషయాలపై స్పందించకుండా వెళ్ళిపోయారు.ఇది ఇలా ఉంటే జానీ మాస్టర్ తాజాగా తన జైలు ఎక్స్ పీరియెన్స్ గురించి మాట్లాడాడు.జైల్లో ఎలా గడిపాడో చెబుతూ కన్నీరు పెట్టేసుకున్నాడు.

Advertisement

శత్రువుకి కూడా ఇలాంటి కష్టం రాకూడదు.జైలుకి అస్సలు వెళ్లొద్దు అంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తరువాత తాను హ్యాపీగా ఉన్నట్టుగా మీమ్స్ వచ్చాయని, కానీ తాను మాత్రం అలా అనుకోలేదంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు.బన్నీ పిల్లల గురించే తాను ఆలోచించానని అన్నాడు.

జైల్లో ఫస్ట్ డే నరకంగా అనిపించిందట.ఎంతటి పెద్దవారైనా సరే నేల మీదే పడుకోవాల్సి ఉంటుందని, ప్రతీ రోజూ సాయంత్రం అయితే ఇంటికి వెళ్లి, పిల్లలతో గడపడం, ఇద్దరు పిల్లలు చెరో భుజంపై తల వాల్చి ముచ్చట్లు చెబుతుండే వారట.

కానీ ఆ రోజు జైల్లో తాను అలా ఒంటరిగా ఉండటం భరించలేకపోయాడట.తన భార్య, పిల్లలు, అమ్మ చాలా గుర్తుకు వచ్చారట.అమ్మకి అసలే ఆరోగ్యం బాగా లేదని, హార్ట్ కొంచెం వీక్‌ గా ఉందని, ఇలాంటి విషయాలు తెలిస్తే ఇంకేం అవుతుందో అని టెన్షన్ పడ్డాడట.

అలాంటి ప్రశ్నలు మాత్రం అస్సలు అడగొద్దు.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!

ఇక ఇవన్నీ తల్చుకుని అందరి ముందు ఏడ్వకుండా అక్కడి బాత్రూంలోకి వెళ్లి భోరున ఏడ్చేశాడట జానీ మాస్టర్.శత్రువుకి కూడా అలాంటి పరిస్థితి రావొద్దని, జైలు జీవితాన్ని చూడొద్దంటూ కోరుకున్నాడు జానీ మాస్టర్.

Advertisement

అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత తాను హ్యాపీగా ఉన్నానంటూ మీమ్స్ వచ్చాయని, వాటిని చూశానని, కానీ ఆ వార్త విన్న తరువాత వెంటనే నాకు బన్నీ పిల్లలు గుర్తుకు వచ్చారని జానీ మాస్టర్ అన్నాడు.ఆ పిల్లల పరిస్థితి ఏంటో అని తాను అనుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ అలా పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయడం కరెక్టే అని, ఒక వేళ తాను ఆ స్థానంలో ఉన్నా కూడా అదే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చాడు.రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తనకు సపోర్ట్ చేసినా చేయకపోయినా వారి పైన ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు అని జానీ మాస్టర్ అన్నారు.

తాజా వార్తలు