మెమరబుల్ పిక్ షేర్ చేస్తూ.. తల్లిపై ఎమోషనల్ పోస్ట్ చేసిన జాన్వీ!

బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా ఉంది.ఈమె హీరోయిన్ గా ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వక పోయిన జాన్వీ అందం, నటనకు మంచి పేరు అయితే వచ్చింది.తల్లి శ్రీదేవి పోలికలతో అందం, అభినయంతో తనను తాను నటిగా ప్రూవ్ చేసుకుంది.

ఇక ప్రెజెంట్ బాలీవుడ్ లో వరుసగా సినిమాలు అయితే చేస్తూ బిజీగా ఉంది.తాజాగా ఈమె నటించిన మిలి సినిమా మంచి విజయం సాధించడమే కాదు.

నటిగా మరో అడుగు పైకి ఎక్కింది.ప్రెజెంట్ జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ తో బవాల్, మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Advertisement

మరి ఈమె బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూనే సౌత్ ఎంట్రీకి కూడా సిధ్దం అవుతుంది.

అందులోను జాన్వీ కపూర్ చాలా రోజులుగా తెలుగు మూవీ చేయడం కోసం ఎదురు చూస్తుంది.ఈ క్రమంలోనే ఈమెకు అదిరిపోయే అవకాశం వచ్చింది.కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో జాన్వీ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని వార్తలు వస్తున్నాయి.

ఈమె ఈ సినిమా కోసం సైన్ చేసింది అని అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అంటూ టాక్ వచ్చింది.

దీంతో ఎన్టీఆర్ సినిమాతో ఈమె ఎంట్రీ కన్ఫర్మ్ అయిపొయింది.ఇదిలా ఉండగా తాజాగా జాన్వీ కపూర్ తన తల్లి గురించి మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసింది.ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను, ఆలోచలను పంచుకుంటూ ఉండే జాన్వీ తాజాగా తల్లి శ్రీదేవితో కలిసి కొన్నేళ్ల క్రితం దిగిన పిక్ షేర్ చేస్తూ.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

అమ్మా నేను ఇప్పటికి నీ కోసం వెతుకుతూనే ఉన్నాను.ప్రతీ చోట, నేను చేసే ప్రతీ పని నీతోనే మొదలవుతుంది.నువ్వు గర్వించేలా చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ హార్ట్ సింబల్ ఎమోజీ జోడిస్తూ జాన్వీ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement