ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం ప్రతిరోజు దేవుని ప్రార్థించా: జాన్వీ కపూర్

టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈ సినిమా తర్వాత ఈయన తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ( Koratala Shiva )దర్శకత్వంలో నటించబోతున్న విషయం మనకు తెలిసిందే.

అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.అయితే ఈ సినిమాని ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 23వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటించబోతున్నారు.ఈమె హీరోయిన్ గా ఇదివరకు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు.అయితే మొదటిసారి ఎన్టీఆర్ తో కలిసి ఈమె ఈ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీలోకి( South Industry ) అడుగు పెట్టబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో సినిమా చేయడం గురించి పలు విషయాలను తెలియజేశారు.

Advertisement

ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ.ఇప్పటికే తాను డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva )కు పలుమార్లు మెసేజ్ చేశానని, రిఫరెన్స్ లు, ప్రిపరేటరీ షూట్స్ కోసం ఆయనని అడుగుతున్నానని తెలిపారు.తాను ఈ సినిమా షూటింగ్లో పాల్గొనడం కోసం రోజులు లెక్కపెడుతున్నానని తెలియజేశారు.

ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావాలని ప్రతి రోజు తాను భగవంతుడిని ప్రార్థించేదాన్ని అయితే తనకల నెరవేరిందని ఈ సందర్భంగా జాన్వీ కపూర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు