తిరుప‌తిలో జ‌న‌వాణి.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌వాణి అనే కార్య‌క్ర‌మాన్ని శ్రీకారం చుట్టారు.

ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌తో పాటు వాటి ప‌రిష్కారం కోసం కృషి చేసే దిశ‌గా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలో తిరుప‌తిలోని రామానుజ‌ప‌ల్లి జేఆర్ఆర్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని పార్టీ అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ప్రారంభించారు.ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా పవ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదుల స్వీక‌రించారు.

అనంత‌రం రాష్ట్ర ప్ర‌భుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక పంచాయ‌తీల‌కు నిధుల విడుద‌ల ఆగిపోయింద‌ని విమ‌ర్శించారు.

టీడీపీతో పాటు వైసీపీకి కొమ్ము కాయ‌డానికి సిద్ధంగా లేన‌ని తెలిపారు.కులాల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు తాను రాలేద‌ని వెల్ల‌డించారు.

Advertisement

అదేవిధంగా రాష్ట్రంలో మూడో ప్ర‌త్యామ్నాయం త‌ప్ప‌నిస‌రిగా అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు