వారాహి వాహనంపై వైసీపీ విమర్శలను ఖండించిన జనసేనాని

ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో జనసేన బస్సు యాత్ర నిర్వహించనుంది.

ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్ర చేసేందుకు ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించి, దానికి వారాహి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

వారాహి వాహనంపై ఇటీవల వైసీపీ చేసిన విమర్శలపై పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.తొలుత తన సినిమాలు ఆపేశారన్న ఆయన విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు వాహనం, హోటల్ గది నుంచి బయటకు రానివ్వలేదని మండిపడ్డారు.

Janasenani Condemned YCP's Criticism Of Varahi Vehicle-వారాహి వా

అనంతరం విశాఖ వదిలి వెళ్లమని బలవంతం చేశారని ఆరోపించారు.మంగళగిరిలోనూ తన కారును బయటకు రానివ్వలేదని, ఇప్పుడు వాహనం రంగు సమస్యగా మారిందని పేర్కొన్నారు.

సరే.నేను ఊపిరి కూడా పీల్చుకోవడం ఆపేయాలా అని ట్విట్టర్ వేదికగా జనసేనాని ప్రశ్నించారు.

Advertisement
జియో సైకిల్ : ఒకసారి ఛార్జ్ చేసారంటే 80 కి.మీ ఏకధాటిగా చుట్టి రావచ్చు!

తాజా వార్తలు