పొత్తులపై బీజేపీని సైడ్ చేసినట్టేనా ?

ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లో అస్పష్టంగా ఉన్న పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది.

తెలుగుదేశం జనసేన ఇకపై కలసి నడుస్తాయని , రేపటి నుంచి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని, ఉమ్మడిగా పోరాటం చేస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan kalyan ) తెలుగుదేశం ప్రధాన జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్( Nara lokesh ) మరియు నందమూరి బాలకృష్ణ సమక్షంలో తేల్చి చెప్పేశారు.

ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న అరాచక పాలనకు ముగింపు పలకాలంటే కచ్చితంగా ఉమ్మడిగా నడవాలని ఆంధ్రప్రదేశ్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చంద్రబాబు లాంటి వ్యక్తిని ఇలా రాజమండ్రి సెంట్రల్ జైలు లో చూడడం చాలా బాధాకరంగా ఉందన్న పవన్ తమ రెండు పార్టీల పొత్తు తమ పార్టీల భవిష్యత్తు కోసం కాదని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్తు కోసం అంటూ తేల్చేశారు.

అంతేకాకుండా తాము ఎన్డీఏ కూటమిలోనే ఉన్నామని తమ పొత్తులోకి భాజపా కూడా వస్తుందంటూ ఆశా భావాన్ని వ్యక్తం చేశారు .అయితే తెలుగుదేశం తో పొత్తుల ప్రకటన పై బిజెపిని( BJP ) ఏ విధంగానూ సంప్రదించలేదన్నట్లుగా పవన్ వైఖరి ఉంది .తాము తెలుగుదేశంతో కలిసి నడిచేది ఖచ్చితమని అవసరమనుకుంటే బీజేపీ నే దిగి వస్తుందన్నది పవన్ ఆలోచనగా తెలుస్తుంది.ఈ విషయంలో పవన్ దూకుడుగానే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.

చంద్రబాబు లాంటి విజనరీ లీడర్ను జైలు పాలు చేస్తే , తాపీగా వేడుక చూస్తున్న కేంద్ర వైఖరిపై నిరసన గానే పవన్ ఇలా దూకుడుగా తన నిర్ణయాన్ని ప్రకటించారన్న విశ్లేషణలు కూడా వస్తున్నాయి .ఇక బిజెపి ఈ పొత్తులోకి వచ్చినా రాకపోయినా తాము మాత్రం కలిసే నడుస్తామన్న స్పష్టమైన సంకేతాలను అయితే పవన్ ఇచ్చేశారు.ఇప్పుడు ఈ కూటమి లోకి చేరాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సిన స్థితిలో భాజపా ఉంది .

Advertisement

ఇంతకాలం రెండు పార్టీలకు సమాన దూరం పాటిస్తూ లోపాయికారి ఒప్పందాలతో పని నడిపించిన భాజపా ఇప్పుడు జగన్ వైపో చంద్రబాబు వైపో కచ్చితంగా తేల్చుకోవాల్సిన పరిస్థితిని పవన్ సృష్టించారు.మరి ఇప్పుడు బహిరంగంగా తన మద్దతును ప్రకటించాల్సిన పరిస్థితిలో బాజాప నిలబడింది.ఇలా బంతి ని భాజపా కోర్టులో వేసేసిన పవన్ తాను మాత్రం తెలుగుదేశం వైపు నిలబడ్డారు.

ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?
Advertisement

తాజా వార్తలు