వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ ఏర్పాటు లో కీలక పాత్ర పోషించడానికి దూకుడుగా ముందుకు వెళుతున్న జనసేన అధినేత తన వారాహి యాత్ర( Varahi yatra )తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నారు.
అధికార వైసిపి బలాలపై దృష్టి పెట్టిన పవన్ ఒక్కొక్కటిగా జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలపై విమర్శల బాణాలు ఎక్కు పెడుతూ వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చకు దారి తీసేలా చేస్తున్నారు .
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని మీడియా వాలంటీర్ వ్యవస్థ పై విస్తృత కథనాలను ప్రచారం చేస్తుందంటే అది పవన్ కళ్యాణ్ ప్రయత్న ఫలితమే అని చెప్పాలి.వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రం మొత్తం ప్రయత్నించి ఫెయిల్ అవ్వటం కన్నా వ్యూహాత్మకంగా కొన్ని ప్రత్యేక ఏరియాస్ ని కవర్ చేయాలని భావిస్తున్న జనసేన అధినేత ఉబయ గోదావరి జిల్లాలను ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.
దీని తర్వాత టార్గెట్ విశాఖపట్నం( Visakhapatnam ) అని విశాఖపట్నం లో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 4 నియోజకవర్గాలను జనసేన ఎంచుకుందని అందులో భీమునిపట్నం, గాజువాక ఉన్నాయని వార్తలు వచ్చాయి .అయితే ఇప్పుడు జనసేన కన్ను విశాఖపట్నం ఈస్ట్ పై పడినట్టుగా తెలుస్తుంది ఇటీవల అధికార పార్టీకి రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లా ఇన్చార్జ్ పంచకర్ల రమేష్ బాబు తన అనుచర గణం తో జనసేనలో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.ఇటీవల నిర్వహించిన అభిమానుల మీటింగ్లో అభిమానులంతా ముక్తకంఠంతో జనసేనలో చేరాలని నినదించగా దానికి ఆయన సుముకత వ్యక్తం చేశారని వార్తలు వస్తునందున జనసేనలో రమేష్ బాబు ( Panchakarla Ramesh Babu)ఎంట్రీ ఖాయమనే చెప్పొచ్చు .ఆయన పెందుర్తి నుంచి పోటీ చేస్తాను ఇప్పటికే స్పష్టం చేసిన దరిమి లా జనసేన ఖాతాలో పెందుర్తి సీటును కూడా కలుపుకోవచ్చు అని చెప్తున్నారు.
అయితే తెలుగుదేశం( TDP ) కీలక నేతమరియు వ్యాపారవేత్త ఆయన గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం లోని క్రియాశీలక నేతల్లో ఒకరుగా ఉన్నారు.గత ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ నుంచి జగన్ వేవ్ లో కూడా గెలిచిన గంటా శ్రీనివాసరావు ఇప్పుడు మరొకసారి ఎన్నికలలో రియాక్టివేట్ అయి విశాఖ నుంచి మరోసారి పోటీకి ఏర్పాట్లు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఈ సీట్ నుంచి జనసేన తమ మహిళా నేత పసుపులేటి ఉషా కిరణ్ ని పోటీ చేయించే ఉద్దేశంలో ఉందని గత ఎన్నికలలో రాజకీయాలకు కొత్త అయినా 20 వేలకు పైగా ఓట్లు తెచ్చుకున్న ఆమె ,ఇప్పుడు క్రియాశీలకంగా పని చేస్తున్నారని ప్రజల మద్దతు సంపాదించుకున్నారని, ఆమె గెలుపు లాంఛనమే అని భావిస్తున్న జనసేన ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ ఈస్ట్ సీటును పొత్తులో పొందాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది మరి ఉన్న ఏడు సీట్లలో నాలుగు సీట్లు జనసేనకే ఇవ్వడానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఒప్పుకుంటారా అన్నదే ప్రశ్న.
ఏది ఏమైనా జనసేన రాజకీయ ఎదుగుదల తెలుగుదేశం మూల స్తంభాలకు ఇబ్బందికరంగా మారినట్లే తెలుస్తోంది .మరి జగన్ ఓడించాలంటే పొత్తు తప్పనిసరిని భావిస్తున్న చంద్రబాబు జనసేన డిమాండ్ లకు తల ఓగ్గే అవకాశమే ఉందని వార్తలు వస్తున్న దరిమి లా మరి ఈ తెలుగుదేశం నేతలు భవిష్యత్తు ఏమిటో చూడాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy