బీజేపీలో జనసేన విలీనం ? 'మెగా' రాయబారం ఇదేనా ?

మెగా బ్రదర్స్ చిరు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ పార్టీలు పెట్టి సీఎం అవుదామని కలలుకన్నవారే ! అయితే వారికి భారీగా అభిమానులు, ప్రజల్లో గుర్తింపు ఉన్నా ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఇద్దరికీ పరాభవమే ఎదురయ్యింది.

అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి అనతికాలంలోనే ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.

ఇక పవన్ పార్టీ విషయానికి వస్తే కేవలం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మెగా బ్రదర్స్ ఇద్దరూ ఈ విధంగా రాజకీయాల్లో ఫెయిల్ అవ్వడం వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో తమ్ముడి రాజకీయ భవిష్యత్తు కోసం చిరంజీవి కలవరం చెందుతున్నాడట.అందుకే పవన్ కళ్యాణ్ కోసం మెగా ఆఫర్ తెచ్చినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ చెక్కెర్లు కొడుతోంది.

పవన్ కళ్యాణ్‌ను రాజకీయంగా నిలుదొక్కుకునేలా చేసేందుకు చిరు కదుపుతున్నట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ను 2024లో జరుగబోయే ఎన్నికల బలమైన నాయకునిగా తయారు చేసేందుకు ఓ ప్రధాన రాజకీయ పార్టీ నుంచి ఆఫర్ ను చిరు తెచ్చాడట.

Advertisement

కాకపోతే చిరంజీవి తెచ్చిన ఈ ఆఫర్‌ను పవన్ కళ్యాణ్‌కు ఓ రాయబారి ద్వారా చేరవేయగా దానికి పవన్ ససేమీరా అన్నట్టు తెలుస్తోంది.చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు తెచ్చిన ఈ ఆఫర్ ఎంటనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

పవన్ కళ్యాణ్‌ను బీజేపీలో జనసేనను విలీనం చేయాలన్న ప్రతిపాదనట.జనసేనను బీజేపీలో విలీనం చేస్తే పవన్ కళ్యాణ్‌కు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు కూడా బీజేపీ సిద్ధమయ్యిందట.

పవన్ కళ్యాణ్‌ను రాజ్యసభకు పంపి ఏపీ ఎన్నికల సమయం వరకు బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

అంతే కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.దానిలో భాగంగానే చిరంజీవి చేత పవన్ కళ్యాణ్‌కు రాయబారం పంపినట్టు గుసగుసలు మొదలయ్యాయి.అన్న తెచ్చిన ఈ ఆఫర్ మీద తమ్ముడు పెద్దగా ఆసక్తి చూపించలేదట.

అంతే కాకుండా అన్న తెచ్చిన సందేశాన్ని విన్న పవన్ అన్నపై ఒకింత అసహానం వ్యక్తం చేసినట్లు ఇప్పుడు ప్రచారం మొదలయ్యింది.మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీని విమర్శించి, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాటతప్పిన పార్టీలో జనసేనను విలీనం చేస్తే జనంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని, అప్పుడు వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ తన భవిష్యత్తు ప్రాణార్ధకం అవుతుందని పవన్ అభిప్రాయపడ్డాడట.

Advertisement

అయితే బీజేపీ మాత్రం ఏదో ఒకరకంగా పవన్ ని ఒప్పించి ఏపీలో బలపడాలని తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు