ముఖ్యమంత్రి కార్యాలయం అని ప్రకటించే దమ్ము ఉందా? నాదెండ్ల

తెల్లారి లేస్తే తాము పేదల పక్షం అని ఒకవైపు చెప్పుకుంటూ మరోవైపు అత్యంత భారీ ఖర్చుతో రుషికొండపై( Rushikonda ) భవనాలను నిర్మిస్తున్నారని, పేదలకు పెత్తందారులకు మధ్య ఎన్నికల యుద్దం అని చెప్పుకునే నైతిక అర్హత అధికార వైసిపి పార్టీకి లేదని జనసేన అగ్రనేత నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) వ్యాఖ్యానించారు.రుషికొండపై నిర్మించేది టూరిజం ప్రాజెక్టు అని చెప్పి అనేక బ్యాంకుల నుంచి నుంచి రుణాలు తెచ్చుకున్నారని అంతేకాకుండా ఈ విషయంలో న్యాయస్థానాల్లో దాఖలైన కేసులలో కూడా టూరిజం ప్రాజెక్టు అని అఫ్ఫిడవిట్ లు సమర్పించారని కానీ 450 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయం( CM Office ) నిర్మిస్తున్నారని,

పేదలకు సెంటు భూములలో నిర్మిస్తున్న కాలనీలలో కనీస సదుపాయాలు కూడా లేవని మరలాంటి అప్పుడు పేదలకు గొప్ప మేలు చేసినట్లుగా ఎందుకు చెప్పుకుంటున్నారు అంటూ ఆయన నిలదీశారు.

ముఖ్యమంత్రి నివాసం మరియు కార్యాలయం కోసం 9 ఎకరాలు అదే సాధారణ ప్రజల కోసం సెంటు భూమి ఇస్తున్నారని ముఖ్యమంత్రి ఇంటిలో గడ్డి కోసం 21 కోట్లు ఖర్చు పెడుతున్నారని, ప్రపంచంలో ఏ ప్రభుత్వ అధినేత కూడా ఇంత విలాసవంతంగా ఉండడని ఆయన ఎద్దేవా చేశారు.మంగళగిరి పార్టీ ఆఫీసులో( Mangalagiri Party Office ) విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ నాయకులకు( YCP ) దమ్ముంటే ఋషికొండలో కడుతున్నది ముఖ్యమంత్రి కార్యాలయం అవునో కాదో చెప్పగలరా అంటూ సవాలు విసిరారు.

ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చెప్పండి ఎవరు పెత్తందార్లో ఎవరు పెద ప్రజల పక్షాన ఉన్నారో అంటూ వాఖ్యనించారు .సమన్వయ సమావేశాలు చివరి దశకు వచ్చాయని ఇక ఉమ్మడి కార్య చరణ మొదలవుతుందని , నియోజక వర్గాల వారీగా ఇంటిటికి వెళ్ళి ప్రబుత్వ వైపల్యాలను వివారిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.తెలంగాణ లో జనసేన అభ్యర్ధులు పోటీ లో ఉన్న చోట తమ అధినేత ప్రచారం చేస్తారని అదే విదం గా బజాపా అగ్రనేత అమిత్ షా సభలకు కూడా పవన్( Pawan Kalyan ) హాజరావుతారని నాదెండ్ల స్పష్టం చేశారు .

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు