గోదావ‌రిలో జ‌న‌సేన హీరో... టీడీపీని జీరో చేసిందే ?

ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌లు మార్పు కోరుకున్న ప‌రిస్తితి తాజా ఎన్నిక‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ త‌ర్వాత జ‌న‌సేన పుంజుకుంటున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి.

ఇక్క‌డి ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది.గ‌తంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని గెలిపించా రు.ఇక‌, ఇప్పుడు అధికార పార్టీవైపు మొగ్గు చూపుతూనే మ‌రోవైపు జ‌న‌సేన వైపు నిలిచిన‌ట్టు క‌నిపిస్తోంది.ఒక్క‌మాట‌లో చెప్పాలంటేఇక్క‌డి ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయాల‌ను కోరుకుంటూ ఉంటారు.

ఒక్కొక్క‌సారి ఇండిపెండెంట్ల‌ను కూడా గెలిపిస్తారు.తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ నాలుగు ద‌శ‌ల ఎన్నిక‌ల్లో ఉభ‌య గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు చాలా భిన్నంగా క‌నిపించింది.

కాపు సామాజిక వ‌ర్గంతోపాటు క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం కూడా జ‌న‌సేన వైపు తిరిగిన‌ట్టు క‌నిపిస్తోంది.ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల రిజ‌ల్ట్ చూస్తే.

Advertisement
Janasena Hero In Godavari Zero On TDP,ap,ap Political News,latest News,latest P

తూర్పుగోదావ‌రి జిల్లా విష‌యానికి వ‌స్తే తొలి విడ‌త‌లో 366, రెండో విడ‌త‌లో  547, మూడో విడ‌త‌లో 186, నాలుగో విడ‌త‌లో 273 పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి.

Janasena Hero In Godavari Zero On Tdp,ap,ap Political News,latest News,latest P

వీటిలో 768 స్థానాలు వైసీపీ, 149 టీడీపీ,  100 ఇత‌రుల‌కు ద‌క్కిన‌ట్టు లెక్క‌లు చెబుతున్నాయి.ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా విష‌యానికి వ‌స్తే తొలి విడ‌త‌లో 239, రెండో విడ‌త‌లో 210, మూడో విడ‌త‌లో 178, నాలుగో విడ ‌త‌లో 266  పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే వైసీపీ 644, టీడీపీ 165, ఇత‌రులు 73  పంచాయ‌తీల్లో పాగా వేశారు, వైసీపీ ఓడిన చోట చూసుకుంటే జ‌న‌సేన రెండో స్థానంలో ఉన్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది.ఏదేమైనా గోదావ‌రిలో జ‌న‌సేన టీడీపీకి పెద్ద దెబ్బే వేసింది.

అయితే ఈ మార్పు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఉంటుందా?  ఉండ‌దా? అనేది చూడాలి.అప్ప‌టి లోగా జ‌న‌సేన పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

తాజా వార్తలు