21,22 తేదీలలో పవన్ నామినేషన్లు! ఆసక్తి పెంచుతున్న రాజకీయం

ఏపీ ఎన్నికలలో మూడు పార్టీలో తమదైన శైలిలో ప్రజలలోకి దూసుకెళ్తున్నాయి.

విధానపరమైన రాజకీయ వ్యూహాలతో ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా బరిలో నిలబడి ఎన్నికల పోరులో విజేతలు కావడానికి సన్నద్ధమయ్యారు.

ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది.అన్ని పార్టీల నుంచి నేతలు నామినేషన్లు వేస్తున్నారు.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్లు వేయడానికి రెడీ అయ్యాడు.ఈ ఎన్నికలలో భీమవరం, గాజువాక నియోజక వర్గాల నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ రేపు గాజువాకలో నామినేషన్ వేసి తరువాతి రోజు భీమవరంలో నామినేషన్ వేయడానికి రెడీ అవుతున్నారు.

అయితే భీమవరం నియోజక వర్గానికి రాజకీయాలలో ఒక సెంటిమెంట్ ఉంది.ఈ నియోజక వర్గం నుంచి ఎవరైతే గెలుస్తారో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.

Advertisement

మరి ఈ సారి భీమవరం పవన్ కళ్యాణ్ సొంతం చేసుకుంటాడా లేదా చిరంజీవిలా ఒక చోట గెలిచి మరో చోట ఓడిపోతాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement