ఏసీబీ వలలో జనగాం మున్సిపల్ కమిషనర్..!

జనగాం జిల్లాలో ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది.జనగాం మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

రూ.40 వేలు లంచం తీసుకుంటూ జంపాల రజిత ఏసీబీ అధికారులకు చిక్కారు.జనగామ పట్టణంలో కొత్తగా ఇల్లు కట్టుకునేందుకు లింగాల గణపురంకు చెందిన ఓ వ్యక్తి దరఖాస్తు పెట్టుకున్నాడు.

ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు గానూ లంచం డిమాండ్ చేశారని తెలుస్తోంది.దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.ఈ క్రమంలోనే ఆ వ్యక్తి నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

తాజా వార్తలు