ఇమ్యూనిటీని పెంచే నేరేడు గింజ‌లు..ఎలా తీసుకోవాలంటే?

ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది ప్రాణాల‌ను బ‌లి తీసుకున్న‌ ఈ మాయ‌దారి వైర‌స్ ఎప్పుడు సంపూర్ణంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేదు.

ఇక ఈ మ‌హ‌మ్మారి నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే రోగ నిరోధ‌క వ్య‌వస్థ‌ బ‌లంగా ఉండాలి.ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌లంద‌రూ ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

డైట్‌లో ఎన్నో మార్పులు చేసుకుంటారు.అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అలాంటి వాటిలో నేరేడు పండు గింజ‌లు కూడా ఉన్నాయి.సాధార‌ణంగా చాలా మంది చేసే పొర‌పాటు నేరేడు పండ్ల‌ను తిని, గింజ‌లు పారేడం.

Advertisement
Jamun Seeds Help To Boosting Immune System! Jamun Seeds, Benefits Of Jamun Seeds

కానీ, పండ్లు మాత్ర‌మే కాదు.నేరేడు గింజ‌లూ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Jamun Seeds Help To Boosting Immune System Jamun Seeds, Benefits Of Jamun Seeds

ముఖ్యంగా ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచ‌డంలో నేరేడు గింజ‌లు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.నేరేడు గింజల్ని ఎండ బెట్టి మెత్తగా దంచి పొడి చేసుకోవాలి.ఈ పొడిని అన్నంలో కలుపుకుని తినొచ్చు.

నీటిలో కలుపుకుని తాగొచ్చు.లేదా మ‌జ్జిగ‌లో క‌లిపి కూడా తీసుకోవచ్చు.

ఇలా ఎలా తీసుకున్నా నేరేడు గింజ‌ల్లో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవ‌నాయిడ్లు, ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.దాంతో వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

అంతేకాదు, నేరేడు గింజ‌ల‌ను మ‌ధుమేహం రోగులు తీసుకుంటే బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.క‌డుపు అల్స‌ర్‌తో బాధ ప‌డే వారు నేరేడు గింజ‌ల పొడిని మ‌జ్జిగ‌లో క‌లిపి తీసుకుంటే అల్స‌ర్ స‌మ‌స్య‌ త‌గ్గు ముఖం ప‌డుతుంది.

Advertisement

ఇక నేరేడు గింజ‌లు తీసుకుంటే జీర్ణ స‌మ‌స్య‌లు కూడా దూరం అవుతాయి.కాబ‌ట్టి, ఇక‌పై నేరేడు పండ్లు తినేట‌ప్పుడు గింజ‌ల‌ను మాత్రం పారేయ‌కండి.

తాజా వార్తలు