ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ లను అభ్యర్థించిన జేమ్స్ డైరెక్టర్.. ఎందుకంటే

కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది గుండెపోటుతో మరణించిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఆయన ఆకస్మిక మరణం నుంచి ఇప్పటికే అభిమానులు కుటుంబ సభ్యులు బయటపడలేక పోతున్నారు.

ఇక పునీత్ మరణించిన తర్వాత ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్.ఈ సినిమా ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల కాగా ఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ సినిమా కన్నడనాట థియేటర్లలో సందడి చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ లను,ఎగ్జిబిటర్లకు ఒక విన్నపం చేశారు.ఈ సినిమా గత శుక్రవారం విడుదల కాగాఎంతో మంచి ఆదరణ దక్కించుకుంది.

ఇప్పటికీ పునీత్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చే ఈ సినిమాని వీక్షిస్తున్నారు.కర్ణాటకలో ఇప్పటికీ ఈ సినిమాకి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Advertisement

ఇకపోతే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీ అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది.ఇక కర్ణాటకలో సైతం ఈ సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు.

ఈ సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయితే పునీత్ సినిమాపై ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడతాయి.

ఈ క్రమంలోనే జేమ్స్ డైరెక్టర్ చేతన్ కుమార్ ఈ విషయంపై ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ లను,ఎగ్జిబిటర్లకు విన్నపం చేస్తూ థియేటర్ల నుంచి జేమ్స్ సినిమాని తీసేయండి అంటూ ఒక వీడియో రూపంలో వారికి విన్నపం చేశారు.పునీత్ చివరి సినిమా జేమ్స్ కమర్షియల్ చిత్రం కాదని.అది ఒక ఎమోషనల్ సినిమా అంటూ ఆయన వివరించారు.

మరి డైరెక్టర్ చేతన్ కుమార్ విన్నపం పై డిస్ట్రిబ్యూటర్స్,ఎగ్జిబిటర్స్ ఎలా స్పందిస్తారో తెలియాల్సి ఉంది.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు