ఈ అవార్డు ఎప్పుడో రావాల్సింది చాలా ఆలస్యమైంది... కీరవాణి గురించి జక్కన్న ఎమోషనల్ పోస్ట్!

తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పటికే ఎన్నో అవార్డులను పురస్కారాలను అందుకున్నటువంటి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఈయన సంగీత సారథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం RRR.

ఈ సినిమా జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ముఖ్యంగా ఈ సినిమాకు కీరవాణి అందించిన బాణీలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా ఎన్నో పురస్కారాలను అందుకుంది ఈ సినిమాలోని నాటు నాటు పాట ఏకంగా ఆస్కార్ నామినేషన్ లో నిలవడం విశేషం.ఇదివరకే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో కూడా నిలిచింది.

ఇంకా చిత్ర బృందం ఈ సంతోషం నుంచి బయటపడక ముందే కేంద్ర ప్రభుత్వం సంగీత దర్శకుడు ఎంఎం కీరవానికి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించడంతో చిత్ర బృందం మరింత సంతోషం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే కీరవాణికి పద్మశ్రీ పురస్కారం రావడంతో ఈ విషయంపై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు.

Advertisement

ఈ సందర్భంగా రాజమౌళి కీరవాణి వయోలిన్ వాయిస్తూ ఉండగా తాను కింద కూర్చున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ.నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది.చాలా ఆలస్యమైంది.

కానీ మీరు ఎప్పుడూ చెబుతారు కదా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లాడగలిగితే కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా.ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాకే మరొకటి ఇవ్వమని చెబుతాను అంటూ పోస్ట్ చేశారు.

నా పెద్దన్న కీరవాణి పద్మశ్రీ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉంది అంటూ రాజమౌళి ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు