కికి ఛాలెంజ్ లో అతను చనిపోయాడంటూ పోలీసుల ట్వీట్ చూసి షాక్.! అతని ఫోటో పోలీసులకు ఎలా దొరికిందంటే.?

ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్’ చాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్‌లు ఉద్యమంగా మారాయి.ప్రజలలో మార్పు కలిగించేందుకు సవాళ్ళు విసురుతున్నారు.

తాజాగా మరో ఛాలెంజ్ వచ్చింది.అదేమిటంటే… ప్రముఖ సింగర్ డ్రేక్ పాడిన ‘ ఇన్ మై ఫీలింగ్స్’ పాట విపరీతంగా పాపులర్ అవ్వడంతో హాలీవుడ్ నటుడు షిగ్గి ‘కికి ఛాలెంజ్’ పేరుతో ఓ ఛాలెంజ్ విసిరాడు.

దీంతో అంతర్జాతీయ స్థాయి నుంచి సినీ నటులు ,యువత ఈ కిక్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నారు.ఈ ఛాలెంజ్ ప్రకారం…‘ కదులుతున్న కారు నుంచి కిందకి దిగి కారు నిదానంగా కదులుతుండగా దానితో పాటు డ్యాన్స్ చేసి మళ్లీ కారులోకి రావడమే’.

ఈ ఛాలెంజ్‌ని పోలీసులు వ్య‌తిరేకిస్తూ, ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ‘కికి చాలెంజ్‌’ స్వీకరించే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.ముఖ్యంగా సినీ నటులు , క్రీడాకారులు ఈ ఛాలెంజ్ స్వీకరించి అనురించడంతో అసలు తంటాలు మొదలవుతున్నాయి.

Advertisement

అయితే ఈ ఛాలెంజ్‌కు అడ్డుకట్ట వేసే క్రమంలో జైపూర్‌ పోలీసులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

‘ఇన్‌ లవింగ్‌ మెమోరీ ఆఫ్‌ కేకే.కీకీ ఛాలెంజ్‌లో షీగ్గీ చేస్తూ ప్రాణాలు కోల్పోయాడు’ అంటూ దండేసి ఉన్న ఓ యువకుడి ఫోటో జైపూర్‌ పోలీసులు ట్విటర్‌ ఖాతాలో ఉంచారు.‘ఛాలెంజ్‌ చేసి ప్రాణాలు తీసుకోకండి’ అంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఆ యాడ్‌ను కొచ్చి(కేరళ)కి చెందిన జవహార్‌ సుభాష్‌ చంద్ర(30) చూసి బిత్తర పోయాడు.అందుకు కారణం ఆ ఫోటోలో ఉంది అతనే కాబట్టే.సోషల్‌ మీడియాలో విస్తృతంగా ఆ ఫోటో వైరల్‌ కావటంతో ఏం జరిగిందోనన్న కంగారుతో బంధువులు అతనికి ఫోన్‌ కాల్స్‌ చేయటం ప్రారంభించారంట.

మీడియా ముందుకు వచ్చిన జవహార్‌ ఈ విషయాన్ని చెబుతూ వాపోతున్నాడు.అసలు కొచ్చిలో ఉంటున్న అతని ఫోటో జైపూర్ పోలీసులకు ఎలా దొరికింది అంటే.? 2008లో జవహార్‌ మోడలింగ్‌ చేసేవాడు.ఆ సమయంలో ఫోటోగ్రాఫర్‌ అయిన జవహార్‌ అంకుల్‌.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

అతన్ని ఫోటోలు తీసి వాటిని షట్టర్‌స్టాక్‌లో ఉంచారు.ఆ సైట్‌ నుంచి ఫోటోలను కొనుగోలు చేసిన పోలీసులు ఇప్పుడు ఇలా యాడ్‌ ఇచ్చారన్న మాట.

Advertisement

తాజా వార్తలు