వైరల్ వీడియో: జాగ్వార్ తాబేలుని తక్కువ అంచనా వేసింది.. తిక్క కుదిరింది దానికి!

అక్కడో దట్టమైన అడవి.అక్కడ సింహాలు, పులులు, చిరుతలు, జాగ్వార్లు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులు వున్నాయి.

అందులో రాజు సింహం.దానికి స్నేహితులు చిరుతలు, జాగ్వార్లు.

ఇవన్నీ కలిసి మిగతా చిన్న జంతువుల పట్ల పెత్తనం చెలాయిస్తూ ఒక్కొక్కదానిని వేటాడి పంచుకొని తింటున్నాయి.అయితే వాటికి కూడా ఓ రోజు వస్తుంది.

అప్పుడు చిన్న జంతువులు పెద్ద జంతువుల భారతాన్ని పడతాయి.ఇంతకీ ఈ మేటర్ ఎందుకంటే, ఇక్కడ వీడియోలో పులిలా కనిపిస్తుంది కదా.అది చిరుతపులి కంటే పెద్ద జంతువు.అంతేకాదు చాలా శక్తివంతమైనది కూడా వాటినే జాగ్వర్లు అంటారు.

Advertisement

అవి చిన్న చిన్న జంతువులను వేటాడే వీడియోలని మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు.కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఒక తమాష జరిగింది.

కాగా ఇపుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఈ వీడియోని నెటిజన్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

నవ్వకుండా ఉండలేకపోతున్నారు మరి.ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసా.ఇక్కడ ఒక జాగ్వర్ తాబేలును వేటాడేందుకు ప్రయత్నించడం మనం చూడవచ్చు.

కానీ ఎంత ట్రై చేసినా దానిని చంపలేకపోతుంది.ఎందుకంటే.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

వాస్తవానికి తాబేళ్ల ప్రత్యేకత మీకు తెలుసేవుంటుంది.వాటి శరీరంపై ఉండే పైభాగం చాలా గట్టిగా ఉంటుంది.ఓరకంగా చెప్పాలంటే వీటికి అది రక్షణ కవచం లాంటిది.

Advertisement

అవి భయపడినప్పుడు లేదా ప్రమాదం ఎదురైనప్పుడు తలని దానిలోపల పెట్టుకొని ప్రాణాలని రక్షించుకుంటాయి.ఈ వీడియోలో కూడా అదే జరిగింది.

తాబేలు తన నోటిని షెల్ లోపల దాచుకోవడం వలన జాగ్వర్ ఎంత ప్రయత్నించినా దాని మెడని అందుకోలేకపోతుంది.ఈ వీడియో చూడటానికి చాలా ఫన్నీగా వుంది.

ఎందుకంటే అంత బలమైన జంతువు కూడా ఓ చిన్న జంతువుని ఏమి చేయలేకపోవడం ఒకింత నవ్వుని తెప్పిస్తుంది.

తాజా వార్తలు