నన్ను మళ్లీ అమ్మేస్తావా... ఆమనిపై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

జగపతి బాబు( Jagapathi Babu ) పరిచయం అవసరం లేని పేరు.

ఒకానొక సమయంలో ఎన్నో ఫ్యామిలీ సినిమాలలో నటించి ఫ్యామిలీ హీరోగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఏమాత్రం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్నారు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నెగిటివ్ పాత్రలలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ జగపతిబాబు ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే జగపతిబాబు సినిమా షూటింగ్ పనులలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇలా ఎన్నో ఫన్నీ విషయాలను  షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా ఒక వీడియోని ఈయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతుంది.అయితే ఇందులో జగపతిబాబు నటి ఆమని( Aamani ) తో సరదాగా మాట్లాడుతూ కనిపించారు.

Jagapathi Babu Funny Comments On Actress Amani Video Goes Viral Details, Amani,
Advertisement
Jagapathi Babu Funny Comments On Actress Amani Video Goes Viral Details, Amani,

ఇక ఈ వీడియోలో భాగంగా జగపతిబాబు పార్ట్‌-1.కోటి రూపాయలకు నా భార్య నన్ను అమ్మేసే ముందు.పార్ట్-2 మేకప్ వేస్తున్నావ్ ఏంటి? నన్ను మళ్లీ మార్కెట్‌లో పెడతావా ఏంటి? అని సరదాగా క్యాప్షన్ రాసుకొచ్చాడు.ఇక మొదటి పార్టులో జగపతిబాబు ఆమనికి మేకప్ వేయగా రెండవ పార్ట్ లో ఆమని జగపతిబాబుకు మేకప్ వేసింది అయితే ఇదంతా కూడా షూటింగ్ సెట్లో సరదాగా జరిగింది.

Jagapathi Babu Funny Comments On Actress Amani Video Goes Viral Details, Amani,

ఇకపోతే జగపతిబాబు ఆమని హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా శుభలగ్నం( Subhalagnam ).ఈ సినిమా అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో డబ్బు కోసం ఆమని జగపతిబాబును నటి రోజాకు అమ్మేస్తారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జగపతిబాబు ఇప్పుడు కూడా ఆమనిని నన్ను మళ్ళీ మార్కెట్లో అమ్మకానికి పెడతావా అంటూ సరదాగా మాట్లాడారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు