Jagapathi Babu : రక్తం కారుతున్న కూడా డబ్బింగ్ ఆపని జగపతిబాబు ….ఇది అతడి డెడికేషన్ లెవెల్

మామూలుగా సినిమాలో నటించేటప్పుడు లొకేషన్స్ లో ఏదైనా గాయాలు కావడం చాలా సహజం.

యాక్షన్ సీన్స్ లో ఏదైనా గాయం చేసుకోవడం లేదా స్కిప్ అయ్యి పడటం లాంటివి చాలా చూసాం.

అలా చాలా సందర్భాల్లో గాయాలు కావడంతో షూటింగ్ కి గ్యాప్ కూడా ఇస్తూ ఉంటారు.కానీ ఇప్పటి వరకు డబ్బింగ్ జరుగుతున్న క్రమంలో గాయపడటం కానీ దాని కోసం ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఆ డబ్బింగ్ కంటిన్యూ చేయడం అనేది ఎవ్వరు చేసి ఉండరు.

కానీ నటుడు జగపతి బాబు( Jagapathi Babu ) మాత్రం అందుకు అతితుడే.తన డెడికేషన్ లెవెల్ వేరే రేంజ్ లో ఉంటుంది మరి.

అరవింద సమేత( Aravinda Sametha Veera Raghava ) చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్( Jr mtr ) కి విలన్ గా జగపతిబాబు( Jagapathi Babu ) నటించాడు.అయితే ఈ సినిమా షూటింగ్ బాగానే జరిగింది దానికి సంబంధించిన డబ్బింగ్ జరగాల్సిన సమయం లో జగపతిబాబు తన డబ్బింగ్ పూర్తి చేసుకోవడానికి వచ్చారు.అయితే చాలా గంభీరంగా జగపతిబాబు గొంతు ఈ సినిమాలో వినిపిస్తుంది.

Advertisement

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన గొంతులో పొడిచే సందర్భంగా మామూలుగా మాట్లాడితే సరిపోదు.దానికి సరైన డబ్బింగ్ రావడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది జగపతి బాబు.

అలా దగ్గుతూ గట్టిగా అరుస్తూ గొంతును మేనేజ్ చేయడానికి ఆయన బాగా ఇబ్బంది పడ్డారట.

అలా దగ్గుతూ గంభీరమైన గొంతుతో చెప్పే సందర్భంలో విపరీతంగా దగ్గడంతో గొంతులోంచి కొంత రక్తం కూడా వచ్చిందట జగపతిబాబుకి.సరిగ్గా అదే సమయంలో ఆ సినిమాకు సంబంధించిన తన డబ్బింగ్ పూర్తి చేసుకోవడానికి తారక్ కూడా స్టూడియోకి వచ్చారట.అలా రక్తం వస్తున్న కూడా డబ్బింగ్ పూర్తి చేయడానికి గమనించారట ఆయన.ఒక నటుడికి ఇంత డెడికేషన్ ఉండాలా అని ఆశ్చర్యపోయారట.ఏది ఏమైనా జగపతిబాబు లాంటి ఒక నటుడు ఇండస్ట్రీకి చాలా అవసరం.

చిన్న చిన్న కారణాలకే ఏదో ఒక వంక పెట్టుకుని షూటింగ్ ఎగ్గొట్టే నటులు ఉన్న ఈ రోజుల్లో అంతటి కష్టాన్ని కూడా జగపతిబాబు తట్టుకున్నారంటే అది మామూలు విషయం కాదు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు