జగనన్న.. గెట్ రెడీ !

ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది.ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉన్నప్పటికి ప్రధాన పార్టీలు ఇప్పుడే ఎన్నికలన్నట్లుగా పోలిటికల్ హీట్ పెంచుతున్నాయి.

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్ష టీడీపీ గట్టి ప్రయత్నిస్తుంటే.అటు జనసేన కూడా ఈసారి గెలుపుపై గట్టిగానే కన్నెసింది.

ఇక అధికార వైసీపీ గురించి ఎంత చెప్పిన తక్కువే.వచ్చే ఎన్నికల్లో కూడా తామే అధికారం చెప్పటికి మరో 30 ఏళ్ల వరకు అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి( YS Jagan Mohan Reddy ).దాంతో అధినేతలందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఎక్కువ సమయం గడిపేందుకే వ్యూహాలు రచిస్తున్నారు.ఇప్పటికే టీడీపీ నుంచి చంద్రబాబు లోకేశ్ పాదయాత్రలు పర్యటనలు చేస్తుంటే.

అటు పవన్ బస్సు యాత్ర కోసం సర్వం సిద్దం చేసుకుంటున్నారు.

Advertisement

అయితే ప్రజాక్షేత్రంలో ఉండే విషయంలో చంద్రబాబు, పవన్ తో( Chandrababu Naidu ) పోల్చితే జగన్మోహన్ రెడ్డి కాస్త ముందున్నారు.గత ఏడాది కాలం నుంచే పార్టీ నేతలను నిత్యం ప్రజల్లో ఉంచుతున్నారు.గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలను, ఎంపీలను, పార్టీ నేతలను నిత్యం ప్రజల్లో ఉంచుతూ పార్టీకి మైలేజ్ తెచ్చే పనిలో ముందున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఇక ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికి స్టిక్కర్స్ అంటిస్తూ ప్రతి ఒక్కరి నోట జగన్ మాట ఉండే విధంగా ప్లాన్ వేశారు వైసీపీ అధినేత.అయితే ప్రజల్లో వైసీపీ పాలకులపై గట్టిగానే వ్యతిరేకత వ్యక్తమౌతువస్తోంది.

ఈ విషయం గడప గడపకు మన ప్రభుత్వం ( Gadapa Gadapa Ku Mana Prabutvam )ద్వారా సొంత పార్టీ నేతలకే స్పష్టంగా తెలిసింది.

దీంతో ఈ వ్యతిరేకత ను అధిగమించేందుకు ఏకంగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగబోతున్నట్లు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

త్వరలో జగన్మోహన్ రెడ్డి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతునట్లు తెలుస్తోంది.అన్నోస్తున్నాడు పేరుతో వారంలో ఒక గ్రామంలో పర్యటించే విధంగా జగన్ ప్రణాళికలు వేస్తున్నటుగా తెలుస్తోంది.అయితే ఈ కార్యక్రమంపై వైసీపీ నేతలు ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికి పోలిటికల్ సర్కిల్స్ లో మాత్రం ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

Advertisement

స్థానిక నేతలపై గ్రామాల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందనే రిపోర్ట్ జగన్ దృష్టికి చేరడంతో వ్యతిరేకతను అధిగమించేందుకు ఈ రకమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.ఈ కార్యక్రమంతో స్వయంగా జగనే ప్రజల మద్యకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మొత్తనికి రూమర్స్ తోనే అగ్గి రాజేస్తున్న అన్నోస్తున్నాడు కార్యక్రమం పోలిటికల్ సర్కిల్స్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.