జిల్లాలో సీట్ల ప్రకటనపై జగన్ నిర్ణయమే ఫైనల్..: వైవీ సుబ్బారెడ్డి

ఏపీలో టీడీపీ నేతలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గతంలో ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.

వైసీపీ అమలు చేస్తున్న ఇసుక విధానం చాలా మెరుగ్గా ఉందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.అదేవిధంగా జిల్లాలో సీట్ల ప్రకటనపై సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు.

బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతల మైండ్ బ్లాక్ అయిందని పేర్కొన్నారు.ఒంగోలు భూ ఆక్రమణలు, కుంభకోణాల విషయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని తెలిపారు.

వైసీపీ ప్రభుత్వానికే ప్రజలు మళ్లీ పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు