వీరికి జగన్ అన్యాయమే చేశారా ? వారి తప్పేంటి ?

ఏపీ మంత్రి వర్గ విస్తరణపై వైసీపీలోనే సదభిప్రాయం లేదు.

ముఖ్యంగా మంత్రి పదవులకు ఎంపిక చేసిన వారి విషయంలో జగన్ పాటించిన విధానాలు , పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నడుస్తూ అన్ని రకాలుగాను పార్టీకి జగన్ కు అండగా నిలుస్తూ వచ్చిన వారికి మొదటి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అన్యాయమే జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మొదటి విడత మంత్రివర్గ విస్తరణ లో సామాజిక వర్గాల లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు.కులాల వారీగా ప్రాధాన్యం కల్పిస్తూ మంత్రి పదవులు కేటాయించారు.

అప్పుడే మంత్రి పదవులు ఆశించిన జగన్ సన్నిహితులు, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అన్ని రకాలుగాను ఆదుకున్నవారు రెండో విడతలో తమకు న్యాయం జరుగుతుందని భావించారు.కానీ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కించుకున్న వారి నేపథ్యం చూస్తే, ఎక్కువ మంది జగన్ ను తీవ్ర స్థాయిలో విమర్శించిన వారే.

ఇతర పార్టీలలో పదవులు అనుభవించి, చివరి నిముషంలో పార్టీలో చేరిన వారే ఎక్కువ మంది ఉన్నారు.అటువంటి వారికి మంత్రి పదవులు దక్కాయి తప్ప, ఏమీ ఆశించకుండా జగన్ కోసం తమ ఎమ్మెల్యే పదవులకు , మంత్రి పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచిన వారికి కూడా రెండుసార్లు జరిగిన మంత్రివర్గ విస్తరణలో అన్యాయమే జరిగిందనే అభిప్రాయాలు సొంత పార్టీ నాయకులోనే అసంతృప్తిని రాజేస్తున్నాయి. 

Advertisement

ముఖ్యంగా ఇప్పుడు మంత్రిపదవులు దక్కించుకున్న విడుదల రజిని టిడిపిలో ఉన్న సమయంలో జగన్ రాక్షసుడు అంటూ విరుచుకు పడిన వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతిన్నాయి.ఇక ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ వంటి వారు జగన్ ను ఘాటుగా విమర్శించిన వారే.వారికీ ఈ క్యాబినెట్ లో జగన్ పెద్ద పీట వేశారు.

కానీ జగన్ కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్లి జగన్ కు మద్దతుగా నిలబడిన ముదునూరి ప్రసాదరాజు, తెల్లం బాలరాజు, గొల్ల బాబురావు, ఇలా చెప్పుకుంటూ వెళితే చాలామంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే జగన్ అన్యాయం చేశారనే అభిప్రాయం జనంలోనూ,  పార్టీ నాయకులలోను చర్చనీయాంశంగా మారాయి.జగన్ కులాల లెక్కల్లో మాత్రమే పదవులు ఇస్తూ.

తనను నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తూ విశ్వసనీయతను కోల్పోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సత్తిబాబు జగన్ నమ్మకాన్ని నిలబెడతారా  ? 
Advertisement

తాజా వార్తలు