జగన్ దీక్ష సిన్సియర్ గా, నీళ్ళు కూడా తాగడం లేదు

ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించేలా తెలంగాణ సర్కారు ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని ఆరోపిస్తూ, వాటిని తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, నిన్నటి నుంచి వైకాపా అధినేత వైఎస్ జగన్ చేపట్టిన జలదీక్షకు ప్రజల నుంచి అద్భుత మద్దతు లభిస్తోంది.

కర్నూలులో ఏర్పాటైన జలదీక్ష వేదిక వద్ద రాత్రంతా సందడి తగ్గలేదు.

నిన్న ఉదయం నుంచి జగన్ దీక్షలో ఉండగా, రాత్రి ఒకసారి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మాత్రమే వేదికను దిగిన ఆయన, రెండు మూడు నిమిషాల్లోనే తిరిగి వేదికపైకి వచ్చారు.ఆపై పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు.

గత రాత్రి రెండు గంటల వరకూ ఆయన అభిమానులను పలకరిస్తూనే ఉన్నారు.ఆపై కాసేపు విశ్రమించారు.

ఈ ఉదయం కాస్తంత అలసటగా కనిపిస్తున్నా, అభిమానులను నిరుత్సాహపరచరాదన్న ఉద్దేశంతో తనను పరామర్శించేందుకు వస్తున్న నేతలు, కార్యకర్తలను చిరునవ్వుతో ఆయన పలకరిస్తున్నారు.కాగా, ఈ మధ్యాహ్నం తరువాత డాక్టర్లు ఆయన రక్తపోటు, షుగర్ లెవల్స్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Advertisement

జగన్ జలదీక్ష వేదిక వద్దకు వస్తున్న ప్రజలు, రైతులు, వైకాపా అభిమానుల సంఖ్య క్షణక్షణానికీ పెరుగుతోందని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు