వైఎస్సార్‌సీపీ నేతకు టీడీపీ ఎంపీ టికెట్ ఆఫర్?

మాజీ డిఎల్ రవీంద్రారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

  గతంలో AP ప్రభుత్వంలో,  కాంగ్రెస్‌ పార్టీలో కీలక పాత్రను పోషించారు కానీ ఇటీవలి కాలంలో రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు.

 కడప జిల్లాకు చెందిన డిఎల్ ఎప్పుడు మీడియా మాట్లాడిన  రాజకీయ విమర్శల కంటే ఆయన మాటల్లో ఎక్కువ విశ్లేషణలు కనిపిస్తాయి.ప్రస్తుతం డీఎల్ రవీంద్రారెడ్డి మరో రఘు రామకృష్ణరాజుగా మారినట్లు కనిపిస్తోంది. వైసీపీలో ఉంటూనే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌పై విమర్శలు గుప్పించిన రవీంద్రారెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమర్ధ నాయకత్వంలోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ సింగిల్ డిజిట్‌కే పరిమితం కావచ్చని, టీడీపీ, జనసేన మళ్లీ కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.రవీంద్రారెడ్డి టీడీపీ అనుకూలంగా మాట్లాడడానికి కారణం ఉందని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది.

 ఇదే విషయమై పార్టీ అధినేత చంద్రబాబుతో కూడా మాట్లాడినట్లు సమాచారం. వైసీపీ చేస్తున్న ఈ వాదనలో నిజం ఉండొచ్చని టీడీపీ అంతర్గత వర్గాలు కూడా భావిస్తున్నాయి.మైదుకూరు నియోజకవర్గం నుంచి 1978 నుంచి 2009 వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన రవీంద్రారెడ్డి అదే సీటుకు టికెట్ అడిగారని చెబుతున్నారు.

 చంద్రబాబు తనకు  స్ఫష్టమైన హామీ ఇవ్వనప్పటికీ, రాయలసీమ ప్రాంతం నుండి ఏదైనా లోక్‌సభ సీటు నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది .

Jagan Is The Most Corrupt Chief Minister Dl Ravindra Reddy Jagan Mohan Reddy, C
Advertisement
Jagan Is The Most Corrupt Chief Minister Dl Ravindra Reddy Jagan Mohan Reddy, C

ఉమ్మడి కడప జిల్లాలో ఏదైన లోక్‌సభ టిక్కెట్‌ను కేటాయించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రవీంద్రారెడ్డికి చంద్రబాబు తెలియజేశారు. ఈ ఆఫర్‌ను అయిష్టంగానే రవీంద్రారెడ్డి అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది.అయితే రవీంద్రారెడ్డి మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నారు, అధికారికంగా పార్టీని వీడలేదు.

 కానీ ఆయన టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు.రవీంద్రారెడ్డి తాజాగా  పరిస్థితులపై అవగాహనకు వచ్చి ఉండవచ్చని అందుకే ఆయన టీడీపీ అనుకూలంగా మాట్లాడి ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు