చీటింగ్- ట్యాపింగ్‎లలో జగన్ కింగ్ మేకర్.. టీడీపీ ఎమ్మెల్యే విమర్శలు

చీటింగ్ -ట్యాపింగ్‎లలో జగన్ కింగ్ మేకర్ అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని తాము చెప్పిందే నిజమైందన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారని పయ్యావుల ప్రశ్నించారు.ఇంటెలిజెన్స్ తో పాటు ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మాల్ వేర్ నిఘా చేస్తున్నారని విమర్శించారు.

అందుకోసం ప్రైవేట్ వ్యక్తులకు డబ్బులు కూడా ముట్టజెప్పారని ఆరోపించారు.ఎవరెవరిపై నిఘా పెడుతున్నారో ఆ కాపీలు హోం సెక్రటరీకి ఇస్తున్నారా అని నిలదీశారు.

ఈ నేపథ్యంలో నిఘా కోసం ఎంత ఖర్చు పెట్టారో కేంద్ర సంస్థలతో ఆడిట్ కి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు