ఇక జగన్ జనాల్లోనే ! ముహూర్తం ఎప్పుడంటే ?

జగన్( Jagan ) ఎప్పుడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పరిమితం అయిపోయారని, జనాల్లోకి వచ్చేందుకు ఆయన భయపడుతున్నారని విపక్షాలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తూనే ఉన్నాయి.

దీనికి తగ్గట్లుగానే జగన్ సైతం అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు .

తాను బయటకు కనిపించకపోయినా,  తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళితే చాలు అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తూ వస్తున్నారు.అయితే ఈ మధ్యకాలంలో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడుతూ,  ఏపీ ప్రభుత్వం( AP Govt ) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , అభివృద్ధి గురించి కంటే వాటిలోని లోటు పాట్లపైనే ఎక్కువగా ఫోకస్ చేయడం,  జనాల్లోనూ దీనికి సంబంధించిన చర్చ జరుగుతుండడంతో, జగన్ జనాల్లోకి రావాలని డిసైడ్ అయిపోయారు.

ఇప్పటికే మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ఇంటింటికి స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టారు .

ప్రజల్లోకి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను తీసుకువెళ్తున్నారు.అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో,  ఇక పూర్తిగా జనాల్లోనే ఉండి , 175 నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా జగన్ వ్యూహాలు రచిస్తున్నారు.జిల్లాలు,  నియోజకవర్గాల వారీగా ఇక పర్యటనలు చేస్తూ నిరంతరం ప్రజల్లో ఉండే విధంగా  చేసుకుంటున్నారు.

Advertisement

మే చివరివారం నుంచి జగన్ జిల్లాల పర్యటనను( Jagans visit to the districts ) చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

26 జిల్లాల్లోనూ ఆయన పర్యటనలు ఉండబోతున్నాయి.  ఒక్కో జిల్లాలో కనీసం 10 నుంచి 14 రోజుల పాటు పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ పర్యటనల్లోనే ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లో నెలకొన్న గ్రూపు రాజకీయాలను చక్కదిద్దే కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టబోతున్నారు.

మే చివరి వారం నుంచి ఎన్నికల వరకు ఇదే విధంగా జనాల్లో ఉంటూ పార్టీని చక్కదిద్దాలని జగన్ నిర్ణయించుకున్నారట.అలాగే అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే విధంగా జగన్ ప్రసంగాలు చేయబోతున్నారట.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు