సీఐడీని జగన్ ప్రైవేట్ సైన్యంగా మార్చుకున్నారు..: సీపీఐ రామకృష్ణ

ఏపీ సీఎం జగన్ పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లండన్ పర్యటనలో ఉన్న జగన్ అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ సహాకారంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని రామకృష్ణ ఆరోపించారు.సీఐడీని జగన్ తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకున్నారన్న ఆయన చంద్రబాబు విషయంలో సీఐడీ అనవసరంగా హడావుడి చేస్తుందని విమర్శలు చేశారు.

వైసీపీ ప్రభుత్వ హాయాంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యంగా మారిందని వెల్లడించారు.అనంతరం సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పవన్ కల్యాణ్ కు ఎందుకు అనుమతి నిరాకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వైరల్ వీడియో : ఇద్దరు వ్యక్తులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
Advertisement

తాజా వార్తలు