లక్ష్మీ పార్వతి రుణం తీర్చుకున్న సీఎం జగన్‌

ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా కూడా నామినేటెడ్‌ పదవులను ఆ పార్టీ నాయకులకు ఇచ్చుకోవడం చాలా పరిపాటిగా వస్తూనే ఉంది.

ఏపీలో జగన్‌ సీఎం అయిన తర్వాత పలు నామినేటెడ్‌ పదవులకు వైకాపా నాయకులను ఎంపిక చేయడం జరిగింది.

టీటీడీ చైర్మన్‌గా ఐవీ సుబ్బారావును ఎంపిక చేయగా, భక్తి ఛానెల్‌ చైర్మన్‌గా నటుడు పృథ్వీని ఎంపిక చేయడం జరిగింది.ఇలా పలువురు వైకాపా నాయకులకు జగన్‌ మంచి పదవులు కట్టబెట్టాడు.

రోజాకు మంత్రి పదవి ఇవ్వలేక పోవడంతో ఆమెకు మంచి నామినేటెడ్‌ పదవిని ఇచ్చాడు.ఇక చాలా కాలంగా వైకాపాకు అట్టి పెట్టుకుని ఉండి సమయానుసారంగా తెలుగు దేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తూ వస్తున్న లక్ష్మీ పార్వతికి సీఎం జగన్‌ కీలక పదవి కట్టబెట్టాడు.

ఒకప్పుడు ఎన్టీఆర్‌ హయాంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన లక్ష్మీ పార్వతికి ఇప్పుడు వచ్చింది చిన్న పదవే అయినా కూడా జగన్‌ ఆమెకు ఇచ్చిన గౌరవంకు ఇది నిదర్శణంగా చెప్పుకోవచ్చు.ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

Advertisement

జగన్‌కు మద్దతుగా నిలుస్తూ ఎన్నో వేదికలపై ఆమె మాట్లాడిన తీరు అందరిని మెప్పించింది.అందుకే జగన్‌ ఆమెకు ఈ పదవి కట్టబెట్టాడు.

Advertisement

తాజా వార్తలు