డబ్బేమో కేంద్రానిది.. పేరేమో జగన్ ది !

సొమ్మొకడిది సోకొకడిది అనే సామెత మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం.ఒకరి డబ్బుతో ఇంకొకరు సోకులు చేసుకోవడం అనేది ఆ సామెత సారాంశం.

ఈ సామెత రాజకీయాలకు అతికినట్లు సరిపోతుంది.ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ కు ఈ సామెత కరెక్ట్ గా సెట్ అవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇంతకీ అసలు విషయం ఏంటంటారా ? రైతు భరోసా పిఎం కిసాన్ మూడో విడత నిధులను ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేశారు.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే అంతకు ముందు రోజే ప్రధాని నరేంద్రమోడీ పి‌ఎం కిసాన్ నిధులను విడుదల చేశారు.అంతే సి‌ఎం జగన్ విడుదల చేయడానికి ముందు రోజే రైతుల ఖాతల్లో నగదు జమ అయింది.అయినప్పటికి సి‌ఎం జగన్ తామే ముందు నిధుల విడుదల చేసినట్లు తెనాలిలో బహిరంగ సభలో బటన్ నొక్కి నిధులు విడుదల చేసినట్లు కవరింగ్ చేశారని.

Advertisement

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు.సి‌ఎం జగన్ చేసిన ఈ పనికి టీడీపీ నేతలు కూడా గట్టిగానే విమర్శిస్తున్నారు.వైఎస్ జగన్ హామీ ఇచ్చినట్లుగా రైతు భరోసా పథకం కింద ప్రతి ఏడాది రైతులకు రూ.15 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.అయితే అధికారలోకి వచ్చిన తరువాత రూ.7500 .మాత్రామే ఇస్తూ వచ్చారు.

ఈ నగదుకు కేంద్ర ప్రభుత్వం అందించే సాయం రూ.6 వేలు కలుపుకొని మొత్తం రూ.13500 తమ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా సి‌ఎం జగన్ ప్రచారం చేసుకుంటున్నారనే విమర్శలు మొదటి నుంచి కూడా వినిపిస్తున్నాయి.అయినప్పటికి జగన్ సర్కార్ మాత్రం ఈ విమర్శలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.

రైతూ భరోసా కు సంబంధించి పూర్తి నిధులను జగన్ ప్రభుత్వమే ఇస్తున్నట్లుగా పెద్ద పెద్ద అక్షరాలతో సి‌ఎం జగన్ పేరు ఎక్కడో మూలన చిన్న అక్షరాలతో కేంద్రం పేరు వేసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంది జగన్ సర్కార్.అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వాల పెత్తనం ఏంటి అని గతంలో కేంద్ర ప్రభుత్వ చురకలంటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయినప్పటికి ఇవేవీ పట్టించుకోవడం లేదు జగన్ సర్కార్.మొత్తానికి జగన్ సర్కార్ వైఖరి చూస్తే సొమ్మకడిది సోకొకడిది అనే సామెత గుర్తు రాక మానదు.

సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా
Advertisement

తాజా వార్తలు