మూడు రాజధానులే.. క్లారిటీ ఇచ్చిన జగన్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేసుకుంటూ వెళ్తోంది.

ఇప్పటికే జీఎన్‌ రావు కమిటీ రిపోర్ట్‌ ఇచ్చేసింది.

కాసేపట్లో బోస్టన్‌ గ్రూప్‌ నివేదిక కూడా రాబోతోంది.ఈ రెండు రిపోర్టులను కలిపి సమగ్ర అధ్యయనం కోసం మరో హైపవర్‌ కమిటీ సిద్ధంగా ఉంది.

Jagan Comments On Ap Capitals

అయితే పేరుకు కమిటీలు అయితే వేస్తున్నారు కానీ.ముఖ్యమంత్రి జగన్‌ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు.ఇంతకు ముందు జీఎన్‌ రావు కమిటీ తన రిపోర్ట్‌ను ఇవ్వడానికి మూడు రోజుల ముందే ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్‌ ప్రకటించారు.

ఆయన చెప్పినట్లే కమిటీ కూడా రిపోర్ట్‌ ఇచ్చింది.ఇప్పుడు బోస్టన్‌ గ్రూప్‌ నివేదిక వచ్చే ముందే మరోసారి మూడు రాజధానులపై జగన్‌ క్లారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది.శుక్రవారం ఏలూరులో జరిగిన ఆరోగ్య శ్రీ పైలట్‌ ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Jagan Comments On Ap Capitals-మూడు రాజధానులే.. క్

పరోక్షంగా మూడు రాజధానిపై స్పష్టత ఇచ్చారు.గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతాం.

Jagan Comments On Ap Capitals

ఏ నిర్ణయం తీసుకున్నా.మూడు ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా తీసుకుంటాం అని జగన్‌ స్పష్టం చేశారు.అందరూ బాగుండాలి.

అన్ని ప్రాంతాలు బాగుండాలి.ప్రతి నిర్ణయం ఇదే ప్రాతిపదికన జరుగుతోందని చెప్పారు.

గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని సరిదిద్దుతామని, అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా ఉండేలా చేస్తామని తెలిపారు.

దుబాయ్‌లో రూ.62,000 అద్దెకు అగ్గిపెట్టె లాంటి రూమ్.. చూసి షాకైన నెటిజన్లు..
Advertisement

తాజా వార్తలు