తమిళ ప్రజలకు ఆనందం వచ్చినా, ఆగ్రహం వచ్చినా ఏదైనా కొత్త ఆలోచన వచ్చినా దాన్ని దాచుకోరు వెంటనే ఏదో రూపంలో బయట పెట్టేస్తుంటారు.
ఇప్పుడు ఆ విధంగానే తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులు ఏపీ సీఎం జగన్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు సంబంధించిన ఫోటోలతో ఓ పోస్టర్ ను తమిళనాడులోని మధురై లో ఏర్పాటు చేశారు.
విజయ్చెవిలో జగన్, ప్రశాంత్ కిషోర్ ఏదో చెబుతున్నట్లుగా ఉంది.ఏపీని మేము కాపాడుకున్నాం, ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడును మీరే కాపాడుకోవాలి అంటూ జగన్ విజయ్ చెవిలో చెబుతున్నట్లుగా ఈ పోస్టర్ లో ఉంది.
దీంతో ఈ పోస్టర్ బాగా వైరల్ అయింది.ఇటీవల విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం విజయం ఎక్కువగా జరుగుతోంది.
దీనికి అనుగుణంగానే విజయ్ కి ఐటీ నోటీసులు రావడం, బిజెపి కావాలని విజయ ను టార్గెట్ చేసుకుందనే ప్రచారం ఊపందుకోవడంతో విజయ్ అభిమానులు బీజేపీ పై మండిపడుతున్నారు.
విజయ్ ను చాలా కాలం నుంచి తమిళ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాల్సిందిగా అభిమానులు కోరుతున్నారు.ఆయన కూడా దీనికి సముకంగానే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.దీంతో ఇప్పుడు ఈ పోస్టర్లు ఈ రకంగా వెలువడడం కలకలం రేపుతోంది.
విజయ్ ఫోటో సరే , ఆయన పక్కన జగన్, ప్రశాంత్ కిషోర్ ఫోటోలను ఏర్పాటు చేయడం వెనుక అర్థాలు చాలానే కనిపిస్తాయి.ప్రశాంత్ కిషోర్ ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా పేరు సంపాదించుకున్నారు.
ఆయన సలహాలు, సూచనలు ఇచ్చిన పార్టీలు ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాయి.
ఆ విధంగానే ఇటీవల ఏపీ ఎన్నికల్లో కూడా జగన్ భారీ మెజార్టీతో 151 సీట్లు గెలుచుకున్నారు.దీంతో ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.తాజాగా ఢిల్లీ ఎన్నికలలో క్రేజీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపొందింది అంటే అది పీకే సలహాలు కారణమనే వాదన తెరపైకి వస్తోంది.
అందుకే విజయ్ అభిమానులు పోస్టర్ ను ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy