ప్రేమ వివాహం చేసుకోబోతున్న జబర్దస్త్ లేడీ కమెడియన్.. ఎవరంటే?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వెడ్డింగ్ బెల్స్ మోగుతున్న సంగతి మనకు తెలిసిందే వెండి తెర సెలబ్రిటీల నుంచి మొదలుకొని బుల్లితెర సెలబ్రిటీల వరకు కూడా ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే కొంతమంది పెళ్లి చేసుకోగా మరి కొంతమంది త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు.

తాజాగా జబర్దస్త్ లేడి కమెడియన్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జబర్దస్త్ (Jabardasth ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి లేడీ కమెడియన్ పవిత్ర( Lady Comedian Pavitra ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

లేడీ కమెడియన్ గా బుల్లితెరపై పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి పవిత్ర (Pavitra) మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు.త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడితో( Pavitra Boyfriend ) కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ తన ప్రేమ పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.గతంలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక యూట్యూబ్ వీడియో చేసిన సంగతి మనకు తెలిసిందే.

అయితే అక్కడ చూపించినటువంటి వ్యక్తిని పవిత్ర నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజాగా తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తే గత సంవత్సర కాలంగా ఈ క్షణం కోసం తాము ఎంతో ఎదురు చూస్తామని తెలియజేశారు.సంతోష్ (Santosh) కూడా ఒక యూట్యూబర్ .గత కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే వీరి పెళ్లి ఎప్పుడు అనే విషయం మాత్రం తెలియచేయలేదు.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!
Advertisement

తాజా వార్తలు