అమ్మాయిలా ఉంటాడని పెళ్లి చేయనన్నారు.. కమెడియన్ భార్య కామెంట్స్ వైరల్!

తెలుగులో సక్సెస్ ఫుల్ గా ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.

కొన్ని ఏళ్లుగా ప్రసారమవుతున్న జబర్దస్త్ షో( Jabardasth ) ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులర్ కి సంపాదించుకొని సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు.కొందరు మేల్స్ ఫిమేల్ గెటప్ వేసుకొని కూడా బాగా ఫేమస్ అయ్యారు.

అయితే నిజానికి జబర్దస్త్ లో ఇప్పుడంటే అమ్మాయిలు కూడా నటిస్తున్నారు కానీ ఒకప్పుడు అమ్మాయిల స్థానంలో లేడీ గెటప్స్ వేసుకున్న పురుషులే నటించేవారు.

అలా చాలామంది లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయ్యారు కూడా.అలా లేడీ గెటప్స్ వేసుకుని ఫేమస్ అయిన వారిలో మోహన్( Mohan ) కూడా ఒకరు.తాజాగా ఈ లేడీ గెటప్స్ గురించి, తాను పడ్డ ఇబ్బందులను జబర్దస్త్ మోహన్ భార్య శ్రీదేవి డ్రామా కంపెనీలో( Sridevi Drama Company ) వెల్లడించింది.

Advertisement

తాజాగా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది.ఈ షోకి మోహన్ తన భార్యతో కలిసి హాజరవ్వగా ఇదే స్టేజి మీద అతని భార్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

ముందుగా రష్మీ( Rashmi ) మీది ప్రేమ పెళ్లా? లేక పెద్దలు కుదిరిచిన పెళ్లా అని అడిగితే రెండు అని ఆమె సమాధానమిచ్చింది.

అదేంటి అంటే తాము ప్రేమించుకున్నామని పెద్దల్ని ఒప్పించామని మోహన్ భార్య సమాధానం ఇచ్చింది.అయితే తన తల్లిదండ్రులకు మోహన్ ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఎందుకంటే అతను అమ్మాయిలా ఉంటాడు ఎక్కువగా జబర్దస్త్ లో అమ్మాయిలు పాత్రలు వేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్లకి మోహన్ నచ్చలేదని చెప్పుకొచ్చారు.అయితే తాను మోహన్ ఇష్టపడడానికి అమ్మానాన్నని ఒప్పించి వివాహం చేసుకున్నట్లు దేవి వెల్లడించింది.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు