జబర్దస్త్ కి మరో కొత్త జడ్జ్... బుల్లితెరపై సందడి చేస్తున్న అందమైన జోడి!

బుల్లితెర పై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమం ఒకటి.

ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమం ఇప్పటికే శుక్ర , శని వారాలలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.ఇక ఈ కార్యక్రమం మొదట్లో ఈ కార్యక్రమానికి జడ్జిలుగా నాగబాబు రోజా(Nagababu Roja) వ్యవహరిస్తూ ఉండేవారు.

నాగబాబు తన వ్యక్తిగత కారణాలవల్ల ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

ఇలా నాగబాబు తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి కమెడియన్ కృష్ణ భగవాన్,సింగర్ మనో వంటి వారు వచ్చారు.అయితే ప్రస్తుతం మాత్రం ఈ కార్యక్రమంలో నాగబాబు స్థానంలో నటుడు శివాజీ(Shivaji ) జడ్జిగా కొనసాగుతున్నారు.ఇక రోజా ఈ కార్యక్రమంలో జడ్జిగా కొనసాగారు ఈమె ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు కానీ మంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.

Advertisement

ఈ విధంగా రోజా(Roja) ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో ఇంద్రజ ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించారు.అయితే తాజాగా జబర్దస్త్ కార్యక్రమం నుంచి విడుదల చేసిన ప్రోమో చూస్తే కనక ఈ కార్యక్రమానికి మరో కొత్త జడ్జి వచ్చారని తెలుస్తోంది.మరి ఈ కార్యక్రమానికి కొత్త జడ్జిగా వచ్చింది వారెవరో కాదు ఒకప్పటి సినీ తార లయ (Laya) ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించబోతున్నారు.

ఇక వెండి తెరపై హీరో శివాజీ లయ జంట సూపర్ హిట్ జోడి అని చెప్పాలి ఇలా వెండి తెరపై సందడి చేసిన ఈ జంట ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు