మేము పొలిటికల్ కమెడియన్స్ కాదు.. ప్రొఫెషనల్ కమెడియన్స్.. ఆది షాకింగ్ కామెంట్స్!

జనసేన క్యాంపెయినర్( Janasena Campaigner ) గా పలువురు జబర్దస్త్ కమెడియన్స్( Jabardasth Comedians ) ఎన్నికైన అనంతరం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే కమెడియన్ హైపర్ ఆది ( Hyper Aadi ) గత మూడు రోజుల నుంచి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.

ఇలా పిఠాపురంలో(Pitapuram) ని పలు మండలాలలో పర్యటన చేస్తున్నటువంటి హైపర్ ఆది అధికార ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల పిఠాపురం( Pithapuram )లో పర్యటించిన ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ అధికార పక్ష నేతలపై విమర్శలు చేశారు.పిఠాపురంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గారికి మంచి స్పందన వస్తుందని ఆయన లక్ష మెజారిటీతో గెలవడం ఖాయమని తెలియజేశారు.

ముఖ్యంగా పిఠాపురం టిడిపి నేతగా ఉన్నటువంటి వర్మ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలని తెలిపారు.గత కొంతకాలంగా ఈ నియోజకవర్గ ప్రజలతో ఎంతో మంచి అనుబంధము ఉన్నటువంటి వర్మ గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేయడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు.

Advertisement

ఇక మీడియా వారు ఆదిని ప్రశ్నిస్తూ జబర్దస్త్ కమెడియన్ల చేత ప్రచారాలు చేయిస్తున్నారు అంటున్నారు కదా వాటిపై మీ స్పందన ఏంటి అనే ప్రశ్న కూడా ఎదురయింది.ఈ ప్రశ్నకు ఆది సమాధానం చెబుతూ మేము ప్రొఫెషనల్ గా కమెడియన్స్ అండి వారిలాగా పొలిటికల్  కమెడియన్స్( Political  Comedians )కాదు మేము అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.ప్రస్తుతం ఆది చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

కేవలం పిఠాపురంలో మాత్రమే కాకుండా జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా హైపర్ ఆది ప్రచార కార్యక్రమాలను నిర్వహించి అన్ని నియోజకవర్గాలలోను జనసేనని గెలిపించుకోవడం కోసం కృషి చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు