Chandrababu Roja : నగరిలో జబర్దస్త్ ఎమ్మెల్యే చేసిందేమీ లేదు..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandra Babu ) ప్రజాగళం( Praja Galam ) ప్రచార సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.

నగరి నియోజకవర్గంలో ఒక జబర్దస్త్ ఎమ్మెల్యే ఉన్నారని విమర్శించారు.

ఆ ఎమ్మెల్యే నగరికి( Nagari ) చేసిందేమీ లేదన్న చంద్రబాబు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అరాచకమే కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్న ఆయన ప్రజలు భయపడాల్సిన పని లేదని చెప్పారు.

వైసీపీ నేతల దౌర్జన్యాలు ఇక నడవవు అని పేర్కొన్నారు.తాము అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ( Mega DSC ) వేసి అరవై రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

పేదల జీవితాల్లో వెలుగు నింపే బాధ్యత తనదన్నారు.చేనేత కార్మికులకు 500 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇస్తామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనం కోసమే మూడు పార్టీలు కలిశాయని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు