మొత్తానికి మహేష్ ఆమెను పట్టేసాడు

మహేష్ బాబు - మురుగదాస్ సినిమాలో సస్పెన్స్ కి తెరపడింది .ఇంతవరకు ఏ సినిమాకి కూడా ఇంత మంది హీరోయిన్ల పేర్లు లింక్ అవలేదేమో.

శృతి హాసన్, కీర్తి సురేష్, ఇలియానా, సాయి పల్లవి, దీపిక పదుకొనే, పరిణీతి చోప్రా, ఆలియ భట్, శ్రద్ధ కపూర్ .ఇంకా ఏమైనా పేర్లు ఉంటే గుర్తు చేయండి .మొదటినుంచి ఈ సినిమాకి బాలివుడ్ భామే హీరోయిన్ అని అంటున్నా, తెలుగు, తమిళ కథానాయికల పేర్లు కూడా జతచేసింది మీడియా.నిజానికి శ్రద్ధ కపూర్ చేయాల్సిన సినిమా ఇది.కాని సినిమా ఆలస్యమవడం, శ్రద్ధ దగ్గర డేట్స్ లేకపోవడంతో, ఇష్టంలేకున్నా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది శ్రద్ధ.పరిణీతి చోప్రా పేరు బలంగా వినిపించినా, దీపిక, ఆలియ భట్ రుమర్లతో, పరిణీతిని పెద్దగా పట్టించుకోలేదు మీడియా.

చివరకి పరిణీతి చోప్రానే ఫిక్స్ అయిపోయింది.అవును .మహేష్ బాబు - మురుగదాస్ సినిమాలో పరిణీతి చోప్రా హీరొయిన్.ఇంకా అనుమానాల్లేవ్ .ఈ జూన్ లోనే సినిమా షూటింగ్ మొదలవుతుంది.మహేష్ - పరిణీతిపై ఓ పాటను చిత్రీకరిస్తారు.

ఆ తరువాత టాకీ పార్ట్ మొదలవుతుంది.

Advertisement
High Roller Tipps & Casino