రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఆ రేంజ్ హిట్ అయితే ఈయనకు పడలేదు అనే చెప్పాలి.
అందుకే లైగర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా ఈ సినిమా దారుణంగా నిరాశ పరిచింది.అందుకే ఈయన నెక్స్ట్ చేస్తున్న సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి.
మరి లైగర్ ప్లాప్ తర్వాత విజయ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఖుషి ( Khushi ).ఈ సినిమాలో విజయ్ కు జంటగా సమంత ( Samantha ) హీరోయిన్ గా నటిస్తుంది.విజయ్ తో పాటు సమంత ఖాతాలో కూడా ప్లాప్స్ ఉండడంతో ఈ జంట హిట్ కొట్టాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఖుషి వంటి ఆకట్టుకునే లవ్ స్టోరీతో ఇద్దరు కలిసి హిట్ అందుకోవాలని చూస్తున్నారు.శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
అందులోనే శివ నిర్వాణ మనసులకు హత్తుకునే లవ్ స్టోరీలను తెరకెక్కించడంలో ఈయన ముందు ఉంటాడు.ఇక ఈ సినిమా షూట్ కంప్లీట్ అయినట్టు మేకర్స్ అఫిషియల్ గా ప్రకటించారు.
ఖుషి షూట్ పూర్తి అవ్వడంతో టీమ్ అంతా కేక్ కట్ చేస్తూ దిగిన ఫోటోలను షేర్ చేసారు.ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అంతేకాదు ప్రజెంట్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉందని సెప్టెంబర్ 1న కలుద్దాం అని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.ఇక మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియన్ మూవీగా నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy