అది చూడడానికి పొట్టి కారు... కానీ ధరలో గట్టి కారు!

ఒకప్పటితో పోల్చుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా కార్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.అవును, ఆటోమొబైల్ రంగం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది.

ఈ క్రమంలో చిన్న కార్లతో పాటు, హ్యాచ్‌బ్యాక్, SUV విభాగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి.సిటీ రైడ్‌ల కోసం చిన్న చిన్న కార్లను ఇష్టపడే కొనుగోలుదారుల సంఖ్య బాగా పెరిగింది.

దీని కారణంగా టాటా నానో, బజాజ్ క్యూట్, PMV EAS E ఇలాంటి కార్ల తయారీ వేగంగా జరుగుతోంది.అటువంటి పరిస్థితిలో ప్రపంచంలోనే అతి చిన్న కారు ఒకటి మార్కెట్లోకి వచ్చింది.

ఆ కారు పేరు Peel-P-50,ఇది కేవలం 134 సెం.మీ పొడవు మాత్రమే ఉండి ఒక్కరు మాత్రమే కూర్చొనే సామర్ధ్యం కలిగి ఉంది.ఈ కారును పీల్ అనే కంపెనీ తయారు చేసినప్పటికీ అలెక్స్ ఓర్చిన్ అనే కంపెనీ డిజైన్ చేసింది.

Advertisement

కారు వెడల్పు 98 సెం.మీ.మరియు ఎత్తు 100 సెం.మీ.ఉంది.కారు బరువు మోటార్ సైకిల్ కంటే చాలా తక్కువ ఉందంటే మీరు నమ్ముతారా? అవును, ఇది కేవలం 59 కిలోలు మాత్రమే.దాని పరిమాణం కారణంగా, ఇది 2010లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అతి చిన్న కారుగా కూడా నమోదు కావడం విశేషం.

పీల్ P50 మోపెడ్ కంటే చిన్న ఇంజిన్‌ను కలిగి ఉంది.పీల్ 4.2 బిహెచ్‌పి పవర్ మరియు 5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 49 సిసి టూ స్ట్రోక్ ఇంజన్‌తో పనిచేస్తుంది.ఇది 3 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తుంది.

ఇకపోతే ఈ కారు గంటకు గరిష్టంగా 61కిలో మీటర్ల స్పీడుతో దూసుకుపోతుంది.లీటర్‌కు 80 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు.కారు బాడీ వచ్చి మోనోకోక్ ఫైబర్‌గ్లాస్‌తో తయారు చేయబడింది.ఇంకా ఫీచర్ల గురించి మాట్లాడుకోవాలంటే రెండు పెడల్స్, గేర్ షిఫ్టర్‌తో పాటు స్పీడోమీటర్‌తో కూడిన కంట్రోలింగ్ వీల్ తప్ప వేరే ఫీచర్ లేదు.P-50 మొదటిసారి 1965లో ఉత్పత్తి చేయబడింది.దీని తర్వాత 2010లో మరోసారి తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు.

ఇప్పుడు P50 లండన్‌లో తయారు చేయబడింది.ఇప్పుడు ఈ కారు ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేయడం విశేషం.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
పైసా ఖర్చు లేకుండా ముఖంపై మచ్చలను పోగొట్టుకోవాలనుకుంటే ఇలా చేయండి!

దీని ధర సుమారు 84 లక్షల రూపాయల వరకు ఉంటుంది.

Advertisement