శరీరంలో ఫ్యాట్ ఎక్కడున్నా ఇట్టే చెప్పేస్తుంది.. మార్కెట్‌లోకి సరికొత్త పరికరం

ఆధునిక యుగంలో అందరూ బిజీబిజీగా మారిపోతున్నారు.సమయానికి తినలేకపోవడం, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటివి చేస్తున్నారు.

జంక్ ఫుడ్ వల్ల శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతోంది.బిజీగా ఉన్న వ్యక్తికి వ్యాయామం చేయడానికి సమయం దొరకడం చాలా కష్టం.

అంతేకాకుండా, కష్టమైన లేదా అధిక తీవ్రత కలిగిన వ్యాయామం చేస్తున్నప్పటికీ ఎక్కువ కాలం దానిని కొనసాగించలేరు.ఫలితంగా శరీరంలో ఎక్కువ మొత్తంలో కొవ్వు పేరుకుపోతుంది.

ఈ తరుణంలో మార్కెట్‌లో సరికొత్త పరికరం వచ్చింది.దాని సాయంతో శరీరంలో ఎక్కవ కొవ్వు పెరుగుతుందో ఇట్టే కనిపెట్టేయొచ్చు.

Advertisement

ఆలివ్ హెల్త్ కేర్ అనే సంస్థ బెల్లో అనే పరికరాన్ని రూపొందించింది.ఇది ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.Bello అనేది శరీర కొవ్వును కొలిచే ఒక వెల్‌నెస్ ఎలక్ట్రానిక్ పరికరం.

జీవక్రియ వ్యాధి నివారణ, ఆహార పరిష్కారాలను అందిస్తుంది.దీనిని NIR (నియర్ ఇన్‌ఫ్రారెడ్) టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు.2022లో ప్రజలకు పరిచయం చేయబడినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ కలిగిన కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.బెల్లో అనేది అరచేతిలో ఇమిడిపోయేంత పరిమాణంలో ఉండే పరికరం.

ఇది శరీర కొవ్వును కొలుస్తుంది.మొబైల్ యాప్ సర్వీస్ ద్వారా జీవక్రియ వ్యాధి నివారణ, శరీరానికి అవసరమైన ఆహారాన్ని సూచిస్తుంది.Bello DEXA-స్కాన్ ఖచ్చితమైన వివరాలను అందిస్తుంది.

శరీర కొవ్వు, విసెరల్ కొవ్వు, మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాద కారకాలను ముందుగానే తెలుపుతుంది.దీనిని ఉపయోగించిన వారు చాలా ప్రయోజనం పొందుతున్నారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

ఫలితంగా ఎక్కడ శరీరంలో కొవ్వు పేరుకు పోతుందో దానికి తగ్గ వ్యాయామాలు చేసి చక్కటి శరీరాకృతిని పొందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు