తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాల కలకలం

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ సోదాల కలకలం చెలరేగింది.ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వసుధ ఫార్మా కంపెనీ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.

వసుధ కంపెనీ ఛైర్మన్, ఆరుగురు డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.కంపెనీ డైరెక్టర్లు అయిన వరలక్ష్మీ, మధుసూదన్, వెంకట రామరాజు, శ్రీనివాసరాజు, నాగవరప్రసాద్ తో పాటు వెంకట రామరాజు నివాసాల్లో దాడులు చేస్తున్నారు.

అదేవిధంగా వసుధ ఫార్మాకు సంబంధించి దాదాపు 20 కంపెనీల్లో సోదాలు కొనసాగుతున్నాయి.పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ట్యాక్స్ ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారని తెలుస్తోంది.

రెండు రాష్ట్రాల్లో ఏకకాలంలో 50 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు