ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విషయం వాస్తవమే..: భట్టి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్ర నూతన సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.

తాజాగా ముఖ్యమంత్రి పదవిపై భట్టి విక్రమార్క స్పందించారని తెలుస్తోంది.రాష్ట్ర సీఎంగా రేవంత్ రెడ్డిని పార్టీ హైకమాండ్ ఎంపిక చేసిందని తెలిపారు.

అయితే తాను కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించిన విషయం వాస్తవమేనన్న భట్టి పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారని సమాచారం.అలాగే పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.

కాగా మరికాసేపటిలో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్న సంగతి తెలిసిందే.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players