యువత జీవితాలతో ఆడుకోవడం సరికాదు..: నారా లోకేశ్

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత నారా లోకేశ్ లేఖ రాశారు.

రాష్ట్రంలో త్వరలోనే ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని విమర్శించారు.

యువత జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం సరికాదని నారా లోకేశ్ లేఖలో పేర్కొన్నారు.ఎస్ఐ మెయిన్ ఎగ్జామ్స్ కు అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు గానూ కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని యువతకు టీడీపీ మద్ధతుగా ఉంటుందన్న ఆయన పరీక్షలకు సమయం ఇవ్వని పక్షంలో నిరసనలు చేస్తామని వెల్లడించినట్లు సమాచారం.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు