మారాల్సింది జ‌గ‌న్ కాదు మ‌న‌మే అంటున్న మంత్రులు.. కార‌ణం ఏంటంటే..?

ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉండ‌టం అంటే ఎంతో రాసిపెట్టి ఉండాలి.పైగా రాజ‌కీయాల్లో చాలా చురుగ్గా కూడా ఉండాలి.

ఎంతో వ్యూహ ర‌చ‌న చేస్తే గానీ.అది సాధ్యం కాదు.

అయితే వ‌చ్చిన అవ‌కాశాన్ని అంద‌రూ స‌ద్వినియోగం చేసుకోలేరు.కేవ‌లం కొంత‌మంది మాత్ర‌మే దాన్ని పూర్తిగా వినియోగించుకుంటారు.

ఇలా వినియోగించుకున్న వారికే మ‌రోసారి అవ‌కాశం ద‌క్కుతుంది.అయితే ఇప్పుడు వైసీపీ ప్ర‌భుత్వంలో కూడా కొంద‌రికి ఇలాగే అవ‌కాశం వ‌చ్చినా.

Advertisement
It Is Not Jagan Who Has To Change It Is The Ycp Ministers Who Are Not Active Det

వారు మాత్రం జ‌గ‌న్ ద‌గ్గ‌ర పూర్తి స్థాయిలో మార్కులు తెచ్చుకోవ‌ట్లేదు.అయితే జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఎక్కువగా మార్కులు కొట్టేస్తున్న వారు మాత్రం ఇద్ద‌రే ఇద్ద‌రు అంట‌.

అందులో ఒక‌రు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే రెండో మంత్రి మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని తెలుస్తోంది.ఈ ఇద్ద‌రూ జ‌గ‌న్ మ‌న‌సెరిగి ప‌నిచేస్తున్నారు.

ఒక‌రేమో పార్టీని వ‌రుస ఎన్నిక‌ల్లో గెలిపిస్తూ జ‌గ‌న్ కు విశ్రాంతి ఇస్తున్నారు.ఇంకొక‌రేమో ఆర్థిక ప‌రంగా ఎలాంటి స‌మ‌స్య‌లు రాకుండా చూస్తూ వ‌స్తున్నారు.

దీంతో ఈ ఇద్ద‌రికీ జ‌గ‌న్ ఎలాంటి హామీలు అయినా ఇస్తున్నారంట‌.పైగా వీరిద్ద‌రూ ఏ ప‌ని చేసినా జ‌గ‌న్‌కు చెప్పే చేస్తున్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

కాగా మిగ‌తా మంత్రులు మాత్రం వీరికి భిన్నంగా ఉంటున్నారు.

It Is Not Jagan Who Has To Change It Is The Ycp Ministers Who Are Not Active Det
Advertisement

మిగ‌తా వారు మాత్రం ఏ ప‌ని చేయాల‌న్నా స‌రే స‌త‌మ‌తం అవుతున్నారంట‌.ఏ స‌మ‌స్య వ‌చ‌చినా స‌రే జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి అక్క‌డ ఇలా ఉంది.ఇక్క‌డ అలా ఉంది అంటూ కంప్ల‌యింట్లు ఇస్తున్నారంట‌.

దీంతో వారితో జ‌గ‌న్ కు ఇబ్బందిగా మారి వారిని కాస్తంత దూరం పెడుతున్నార‌ని స‌మాచారం.వీట‌న్నింటినీ గ‌మ‌నించిన మిగ‌తా మంత్రులు.

మారాల్సింది జ‌గ‌న్ కాద‌ని.తామే మారాలి అంటూ చ‌ర్చించుకుంటున్నారంట‌.

ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్ గా అవుతోంది.మ‌రి రాబోయే రోజుల్లో వారు ఎలాంటి మార్పులు చూపిస్తారో వేచి చూడాలి.

తాజా వార్తలు