ఉద్యోగులు తమ కోసమే కాకుండా సామాజిక బాధ్యతలగా ముందుకు రావడం అభినందనీయం...బాల్కసుమన్

ఉద్యోగులు తమ కోసమే.కాకుండా సామాజిక బాధ్యతలగా ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్.

ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు.తలసేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల రక్త నిధికోసం హైద్రాబాద్ అబిడ్స్ లోని భీమా భవన్లో తెలంగాణ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బాల్కసుమన్, ఉద్యోగులతో కలసి ప్రారంభించారు.

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న ఉద్యోగులు గత 8సంవత్సరాలుగా రాష్ట్ర అభివృద్ధిలో తోడ్పాటు అందిస్తున్నారు.తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రక్తం దొరకక చాలా మంది బాధపడుతున్నారనారు.

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తాన్ని సెకరిస్తున్నట్లు దానికి తోడ్పాటుగా ఉద్యోగులు సహకరించడం హర్షణీయం అని బాల్క సుమన్ తెలిపారు.

Advertisement
పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?

తాజా వార్తలు